Thursday, November 30, 2023

Breaking | ఇండోర్​ స్టేడియం కూలి ముగ్గురు మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం స్లాబ్ కూలి ముగ్గురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. రాజేందర్ నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. శిథిలాల నుంచి మరో మృతదేహాన్ని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement