Wednesday, May 15, 2024

జితేంద్రియులను బాధించని గ్రహపీడలు!

కష్టాలను గురించి హాస్యానికి మాట్లా డుకునే మాట ఒకటుంది. ఒకడు నా నా బాధలూ పడుతూ ఒక జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి ‘అస్సలేమీ బాగుండడం లేదు, అన్నీ బాధలే, ఒకసారి చూసి పరిష్కారంగా ఏదైనా మార్గం చెప్పండి స్వామీ!’ అని అడుగు తాడు. జ్యోతిష్కుడు అతడి వివరాలన్నింటినీ కనుక్కుని, చక్రం వేసి చాలా సేపు పరిశీలించి చివరన నిట్టూర్చి ‘నిజమేనండీ! అసలేం బాగా లేదు. మీరు బాగా ఓపిక పట్టాలి. ప్రయత్నపూ ర్వకంగా నోటిని అదుపులో పెట్టుకుని మెలగా లి. అస్సలు నోరు జారొద్దు. మీ మంచికే చెబు తున్నాను. ఓ పదేళ్ళదాకా ఇలా ఉండాల్సిం దే!’ అంటాడు. ఇలాంటి మాటలు విని ఎవడు మాత్రం తట్టుకోగలడు? ‘ఓరి దేముడా, పదే ళ్ళా?!’ అని ఒకింత సేపు బాధపడి, మొహానికి పట్టిన చెమటను పక్కనే కూర్చునున్న భార్య అందిచ్చిన చేతిరుమాలుతో తుడుచుకుని, కాస్త తేరుకున్నట్లుగా అయ్యి ‘సరే స్వా మీ, ఏంచేస్తాం, గ్ర#హచారం, మీరు చెప్పినట్లే చేస్తాను. కనీసం ఆ తరువాతన్నా సుఖాలు దక్కుతాయా?’ అని అడుగుతాడితడు. అలా ఆశగా అడిగిన అతడికేసి జాలిగా చూసి జ్యోతిష్కుడు ”సుఖాలు రావడమా? నేననేది అప్పటికి మీరు అలవా టుపడిపోతారని, అంతే!” అని నిర్దాక్షిణ్యంగా ముఖం తిప్పేసుకుని తన పనిలో పడిపోతాడు. అలాగ…. ఎఱ్ఱాప్రగడ రచించిన ఆంధ్రభారతం అరణ్యపర్వంలోని ఒక పద్యం చదవగానే ఆ సంగతే గుర్తొచ్చి, ఈ తర హా చతురోక్తులు అప్పట్లోనే ఉన్నాయా? ఈ జోకులకు మూలాలు కూ డా ఇక్కడే ఉన్నాయా? అన్న సందే#హం కలిగింది. ఆ పద్యం ఇది-

కం|| విను డెబ్బది యేఁడుల దాఁ
కను మానవులకు గ్రహోపఘాతంబులు గ
ల్గు; ననంతరంబ గ్ర#హముల
పని వలవదు; ముదిమి యెల్ల పనులకుఁ జాలున్‌.
(అరణ్యపర్వం, పంచమాశ్వాసం, 254వ పద్యం)

”సావధానంగా విను. మనుషులకు డెబ్భై యేళ్ళ వయసు దాకా (గోచారంలో) గ్రహాల గతుల వలన సంభవించే ఘాతాలు (చిన్నవీ, పెద్దవీ దెబ్బలు) తగులుతూనే వుంటాయి. గ్రహాలు పీడిస్తూనే వుం టాయి. ఆ తరువాత నంటారా! గ్రహాలతోనూ, వాటి ప్రభావంతోనూ పని అన్నదే లేదు. ఎందుచేతనంటే, ముసలితనం అనేదే ఆ అన్నిటికీ సరిపోతుంది” అని పై పద్యం భావం.
కనుక, ముసలితనాన్ని మించిన పీడను నవగ్రహాలలో ఏ గ్ర#హ మూ కలిగించలేదని సారాంశం. డెభ్భైయేళ్ళు దాటిన మనిషిలోని ముసలితనం, గ్రహాలకు కూడా పీడను కలిగించే శక్తి కలిగి వుంటుం దనీ, సదరు ముదుసలి జాతకచక్రంలో గ్రహాలన్నవి తమ స#హజమైన శక్తిని పోగొట్టుకుని, కేవ లం పిల్లలు ఆడుకునే బంతుల్లా గిరికీలు కొడు తూ వుంటాయని కూడా అర్ధంచేసుకోవచ్చు.
మనిషి ఆలోచనలో మొదటి నుంచీ ముసలితనమనేది గ్రహాలకే గ్ర#హపీడ వంటిది. అలాంటప్పుడు, అంత పెద్ద గ్రహాలే ముసలితనాని కి భయపడంగా లేనిది, మనిషి భయపడడంలో ఆశ్చర్యమేముం టుంది. వ్యాసుల వారి సంస్కృత మహాభారతంలో కూడా ఈ అభిప్రా యం ఇలానే వ్యక్తం చేయబడింది. తపస్సంపన్నులైన మ#హర్షులు వారి వారి తపశ్శక్తితో వందపైబడి సంవత్సరాలు ఏ శరీర బాధలూ లేకుండా గడపగలిగి వున్న ట్టివైన ఆ రోజులలో కూడా, మనిషికి ముసలితనాన్ని గురించిన భయం, ముసలితనం శరీరానికి తెచ్చిపెట్టే రుగ్మతల గురిం చిన బాధ తాలూకు ఆలోచన ఎఱ్ఱాప్రగడ పై పద్యంలో వెలువరించి నట్టివిగానే వున్నాయని సంస్కృ త మహాభారతం, అరణ్యపర్వంలోని 230వ అధ్యాయం, 57వ శ్లోకం వలన తెలుస్తుంది.

శ్లో|| యావద్‌ సప్తతివర్షాణి భనన్త్యేతే గ్రహా నృణామ్‌|
అత: పరం ద#హనాం తు గ్ర#హతుల్యో భవేజ్జ్వర:||

‘ఒక మనిషికి డెబ్బది సంవత్సరముల వయసు వచ్చే దాకానే గ్ర#హబాధలు, అవి కల్పించే వివిధాలైన పీడలు వుంటాయి. డెబ్బది సం వత్సరముల వయసు తరువాత, ఏ వ్యక్తినైనా జ్వరం వంటి రోగాలు పట్టి పీడిస్తాయి. ఆ బాధలే గ్ర#హబాధలతో సమానంగా మనిషిని పీడిం చి పిప్పి చేస్తాయి’- అని పై శ్లోకం భావం.
అయితే, ఈ సందర్భంలో మరొక గొప్ప మాట కూడా చెప్పబడిం ది ఆ తరువాతి శ్లోకంలో.

- Advertisement -

శ్లో|| అప్రకీర్ణేంద్రియం దాన్తం శుచిం నిత్యమతన్ద్రితమ్‌|
ఆస్మికం శ్రద్దధానం చ వర్జయన్తి సదా గ్రహా:||

”ఎవరైతే తన యింద్రియాలను అన్నివిధాలుగా తన అదుపులో వుంచుకుంటాడో, జితేంద్రియుడో, ప్రతినిత్యం ఆలస్యము అలసత్వ ము లేకుండా శుచికి సంబంధించిన అన్ని నియమాలను శ్రద్ధగా పాటి స్తూ భగవంతునియందు భక్తిప్రపత్తులతో కాలం గడుపుతూ వుంటా డో, ఆ వ్యకి ్తని ఏ గ్ర#హపీడ కూడా బాధించదు. అతడిని ఆ బాధలు వర్జిం చి దూరంగా జరిగిపోతాయి”- అని పై శ్లోకం భావం.

కం|| నియతి గలిగి యింద్రియముల
జయించి శుచులైన శాంతిసంపన్నులకున్‌
భయ మొనరింపఁగ లే వ
వ్యయ పుణ్యా! గ్ర#హము లే యవస్థల యందున్‌.
(ఆంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, పంచమాశ్వాసం, 255వ పద్యం)

”అత్యంత నియమ నిష్ఠలతో తమ రోజువారీ జీవితాన్ని గడుపు తూ, పంచేద్రియాలు పెట్టే ఆరళ్ళకు లోను కాకుండా, లొంగకుండా మానసిక నిగ్రహాన్ని సదా పాటిస్తూ, ఎల్లవేళలా శుచిశుభ్రతలతో శాంత మూర్తులుగా వుండేవారిని ఏ గ్ర#హము కూడా ఏమీ చేయలేదు, వారికి ఈ గ్ర#హపీడలనేవి వర్తించవు” అని పై పద్యం భావం.
వ్యాసుల వారి సంస్కృత మహాభారతంలోని శ్లోకానికి ఎఱ్ఱాప్రగ డ తెలుగులో చేసిన, సరళమైన మాటలతో కూడిన అతి చక్కని, యథా తథానువాదం పై పద్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement