Saturday, May 18, 2024

నవరాత్రి రహస్యాలు – తత్త్వము, వైభవము (ఆడియోతో…)

నవరాత్రి రహస్యాలు – తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

దశహరా అనగా పదిపాపాలను పోగొట్టి పది కర్తవ్యాలను అందించేది. ఆరుకళల సుబ్రహ్మ సౌమ్యము కావున స్త్రీ, చతుష్కళమైన త్రయీబ్రహ్మ ఆగ్నేయము కావున పురుషుడు. వీరి సమన్వయంతోనే విరాట్‌ పురుషుడు ఆవిర్భవించును. ఈయననే యజ్ఞపురుషుడు, కాలపురుషుడుగా కూడా వ్యవహరిస్తారు. ఈ యజ్ఞపురుషుడి నుండే మానవుడు సృష్టించబడెను. ఈయన మానవులను సృష్టించి పరిపాలిస్తున్నాడు కావున ఇతనిని ప్రజాపతి అని అంటారు. ప్రపంచము యొక్క ప్రతీ పదార్థము యజ్ఞపురుషుడు, అగ్ని సోమాత్మకం కావున ఇదే విరాట్‌ రూపం. ఈ విశ్వపురుషుడు విరాట్‌ ప్రజాపతి పది అవయవములు కలిగిన వాడు. వీటినే దశమహావిద్యలని ఈ విద్యలను దశహౌతా, దశా: అను పేర్లతో వ్యవహరిస్తుంటారు.

చంద్రునిలోని తేజస్సు అనగా కాంతి అగ్నిదే కావున స్త్రీ సౌందర్యం పురుషుని అనుభవం లేకుండా సృష్టి జరుగదు. విరాట్‌ పురుషుడిలో కూడా త్రయీబ్రహ్మ ఆగ్నేయం కావున భోక్త మరియు సుబ్రహ్మ సౌమ్యము కావున భోగ్యము అవుతాడు. ‘బ్రహ్మ’ ప్రాణము, ‘సుబ్రహ్మ’ ధనము. దశాక్షర పూర్ణ మైన విరాట్‌తో సృష్టి జరుగదు, న్యూనముతోనే సృష్టి జరుగును.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement