Saturday, April 27, 2024

పోటెత్తిన మేడారం

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: మేడారం జాతరకు భక్తజనం పోటెత్తింది. ఆదివారం సెలవు దినం కావ డంతో తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రాం తాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులతో తల్లుల గద్దెల ప్రాంగణాలు కిటికటలాడాయి. ఆదివారం ఒక్క రోజు మూడు లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధి కారులు అంచనా వేశారు. జాతరకు ముందే వరద ప్రవా హంలా భక్తులు తరలిరావడంతో ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే ప్రధాన జాతరకు భక్తుల సంఖ్య తగ్గిపోనుందా… అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా జాత రకు నెల రోజుల ముందు నుంచే భక్తులు పోటెత్తినప్పటికీ జాత ర ప్రధాన ఘట్టానికి కోటి మందికి పైగా తరలివచ్చారు. ఈ సారి కూడా అదేవిధంగా ఆ మూడు రోజులు భక్తులు వస్తారనే ఆశాభావంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వేలాదిగా తరలివస్తున్న వాహనాలు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రాష్ట్ర నలు మూలల తోపాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది వాహనాల్లో తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బడులకు ఈనెల 31 సెలవులను పొడగించడంతో పిల్లలతో కలిసి తల్లులు దర్శనానికి తరలివచ్చారు. మరోవైపున కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రధాన జాతర సందర్భంగా తరలివచ్చే భక్తజనంతో కరోనా విజృంభిస్తుందనే భయంతో భక్తులు ముందుగానే వచ్చి తల్లులకు మొక్కులను అప్పగిం చుకుంటున్నారు. గత పది రోజులుగా ప్రతి రోజు లక్షకు దక్క కుండా భక్తజనం తర లివ స్తుండటంతో పాటు ఆదివారం రోజున మూడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.
సౌకర్యాలు లేక ఇబ్బందులుపడ్డ భక్తులు
రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధి కోసం రూ. 75 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితేపనులు చేపట్టడంలో ఆలస్యం కావడంతో పాటు జనవరి మొదటి రెండు వారాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా పార్కింగ్‌ స్థలాలు కూడా జలమయంగా మారడంతో ఇప్పటివరకు పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు పోవడం ఇబ్బందిగా మారిం ది. మొన్నటివరకు వానాకాలం వరిపంటలు సాగు చేయడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పార్కింగ్‌ స్థలం కూడా దిగబడటంతో వచ్చిన వాహనదారులందరూ కూడా రోడ్లపైన వాహనాలను నిలుపుకోవాల్సి వచ్చింది. వచ్చి న వాహనాలు వచ్చినట్టే రోడ్లపై నిలబడంతో ట్రాఫిక్‌ సమ స్యలు తలెత్తాయి. వేలాదిగా వాహనాలు రావడం పార్కింగ్‌ స్థ లాలు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement