Saturday, May 4, 2024

”తన్నో ‘శంఖ’ ప్రచోదయాత్‌”

భారతీయ సంస్కృతిలో శంఖం, శంఖనాదం విశిష్ట స్థానం కలిగి నవి. అత్యంత మంగళప్రదమైనవి. ”శామ్యతి అశుభమస్మాదితి మూలత:” అని శంఖం గురించి అంటారు. అశుభాలను శాంతింప జేసేది అని అర్థం. సూర్యుడు, శివుడు, విష్ణువు, గాయత్రి వంటి దేవతల చేతిలో శంఖం ఉన్నట్టి శిల్పాలను, చిత్ర పటాలను మనం చూస్తుంటాము. శంఖంలో దేవత లుంటారు. ”శంఖాదౌ చన్ద్ర దైవత్వం కుక్షౌ వరుణ దేవతా/ ప ష్ఠే ప్రజాపతి శ్చైవ అగ్రే గంగా సరస్వతీ”. శంఖం యొక్క మూల భాగంలో చంద్రుడు, కడు పులో వరుణుడు, పృష్ఠ భాగంలో ప్రజాపతి, అగ్రభాగంలో గంగా సరస్వతు లు ఉంటారట. దైవపూజ సమయంలో, యుద్ధభేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం పంపడానికి శంఖనాదం చేస్తారు. శంఖానికి అర్ణోభవము, కంబు కము, కూతకైదువు, చిందము, త్రిరేఖము, శంబూకము, సూచికా ముఖ ము, హరిప్రియము, మొదలుగా 39 పర్యాయ పదాలున్నాయి. శంఖము మొలస్కా జాతి జీవి నుండి జనించింది. స్ట్రాంబిడే జాతికి చెందిన గాస్ట్రోపో డా తరగతిగా నిర్ణయింపబడింది.
శంఖం శాంతికి, సంపదలకు ప్రతీక. పూజగదిలో ఉంచి పూజిస్తే అన్ని అరిష్టాలూ తొలగి పోతాయి. మందిరాలలో ఇంటిలో, శుభకార్యాలలో శంఖ నాదం చేస్తే పవిత్రత, శోభ, పెరుగుతాయి. క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన 14 రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం శంఖం లక్ష్మీదేవికి సోదరి. సముద్ర తనయ. పూజారాధన, అనుష్ఠానం, హారతి, యజ్ఞం, తాంత్రిక క్రియలలో, శంఖనాదం చేస్తారు. శంఖాన్ని నేలపై ఉంచ రాదు. ఎల్లప్పుడు శుద్ధ జలంతో నింపి, త్రిపాద కూర్మపీఠంపై ఎర్రని వస్త్రాన్ని పరచి, శంఖాన్ని స్థాపించి పసుపు, కుంకుమ, పూలు వంటి వాటితో పూజి స్తారు. శంఖాలలోని రకాలను బట్టి వివిధ పూజా విధానాలుంటాయి. మనో వాంఛలను తీర్చి, సుఖశాంతులను ప్రసాదించే ఈ శంఖాలు మన దేశంలో రామేశ్వరం, కన్యాకుమారి, చెన్నై, విశాఖపట్నం, కలకత్తా, పూరీ, ముంబై, ప్రాంతాలలో, శ్రీలంక, లక్షద్వీప్‌, మానససరోవరాల్లో విరివిగా లభిస్తాయి.


ఆకారాన్నిబట్టి శంఖాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి దక్షిణావృత, మధ్యావృత, ఉత్తరావృత శంఖాలు. ఎడమచేతితో పట్టుకోబడే ది దక్షిణావృత శంఖం. కుడి చేతితో పట్టుకొనేది ఉత్తరావృత శంఖమని, మధ్యలో నోరు ఉన్నదానిని మధ్యావృతమని అంటారు. దక్షిణావృత శంఖా లను పూజించడానికి, ఉత్తరావృతాన్ని ఊదడానికి ఉపయోగిస్తారు. శంఖా లకు అనేక రూపాలు, పేర్లు ఉన్నాయి. లక్ష్మీ శంఖం, గోముఖ, కామధేను, దేవశంఖాలు, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూ ర్మ, వరాహ, వినాయక, శివ, పాంచజన్య శంఖాలనే రకాలున్నాయి. శని శం ఖానికి నోరు పెద్దగా, పొట్ట భాగం చిన్నగా ఉంటుంది. రాహుకేతు శంఖాలు సర్పాకారంలో, రాక్షస శంఖం ముళ్ళతో, వినాయక శంఖం తొండంతో, కూర్మ శంఖం తాబేలులాగా, వరాహశంఖం వరాహ ఆకారంలో ఉంటా యి. శంఖనాదం రణ ఘోషను, విజయాన్ని సూచిస్తుంది. శంఖ ధ్వని శత్రు మూకలకు దడ పుట్టిస్తుంది. మహాభారత యుద్ధ సమయంలో పాండవుల శంఖధ్వని భయంకరమై, భూమి ఆకాశాల మధ్య వ్యాపించి కౌరవ సేనల హృదయాలను దద్దరిల్లింప చేసిందట. శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం. ఇది పంచభూతాత్మకమైనదని గోపాలకోపనీయోప నిషత్తు అంటుంది. ధర్మరాజు శంఖాన్ని అనంతవిజయమని, భీముని శంఖము పౌండ్రకమని, అర్జునునిది దేవదత్తం, నకులునిది సుఘోషమని, స#హ దేవుని శంఖాన్ని మణిపుష్పకమని అంటారు.
శంఖనాదం విజయానికి, సమృద్ధికి, లక్ష్మీదేవి ఆగమనానికి, సౌఖ్యా నికి, ప్రతీకలుగా భావిస్తారు. రాజ్యపట్టాభిషేకాలలో, యజ్ఞాలలో, ధార్మిక ఉత్సవాలలో, విజయదశమి, దీపావళి, శివరాత్రి వంటి పండుగలలో శంఖ ప్రతిష్ఠ చేసి పూజించడం, శంఖనాదం గావించడం చేస్తారు. రుద్ర, గణశ, దేవీ, విష్ణు పూజలలో వినియోగిస్తారు. ”పృథివ్యాం యానితీర్థాని స్థావరాణి చరాణిచ, తాని తీర్థాని శంఖేస్మిన్‌ విశస్తు బ్రహ్మ శాసనాత్‌” శంఖాయ నమ: అని నమస్కరిస్తూ, సమస్తోపచారాలతో శంఖాన్ని పూజిస్తారు.
ఇంటిలో వాస్తుదోషాలు, కష్టాలు తొలగిపోవడానికి ఎర్ర ఆవుపాలతో శంఖాన్ని నింపి ఇల్లంతా చిలకరిస్తారు.విష్ణు శంఖాన్ని దుకాణాలలో, కార్యాల యాలలో, ఫ్యాక్టరీలలో, స్థాపిస్తారు. లక్ష్మీదేవి విగ్రహం ముందు ఈ శంఖా న్ని ఉంచితే ఆమె అక్కడనుండి ఎక్కడికీ పోదని నమ్ముతారు.
శంఖాన్ని పూజించేటప్పుడు చెప్పే శ్లోకం – ”గర్భాదేవారి నారీణాం విశీర్యం తే సహశ్రస:/ తవనాదేన పాతాళే పాం చజన్య నమోస్తుతే”. శంఖాన్ని గట్టిగా పూరిస్తే ఆ నాదానికి రాక్షసులు, దుష్టశక్తులు పారిపోవడమే కాదు, ఆ నాదం వింటే రాక్షసుల భార్యలు గర్భవతులై ఉంటే, వారి గర్భాలు విచ్ఛిన్న మై, పాతాళంలో పడిపోతాయని భావం. ఇండ్లలో పూజగదిలో నీటితో నింపబడిన శంఖం ఉంచి పూజిస్తే సర్వవిధాల మంచిది.
బ్ర#హ్మ వైవర్త పురాణంలో, శ్రీకృష్ణుని పరమ భక్తుడైన గోపసుదాముడు, శాపవశాన శంఖచూడుడు అనే రాక్షసునిగా జన్మించాడని, అతడు ఘోర తప స్సు చేసి బ్రహ్మ వరంతో కృష్ణ కవచాన్ని పొంది, అహంకరించి, దేవతలను, ఋషులను బాధింప సాగాడని, ఇంద్రుడు వెళ్ళి విష్ణువును, శివుని శరణు కోరాడని, విష్ణువు బ్రాహ్మణ వేషంలో శంఖచూడుని వద్దకు వెళ్ళి కృష్ణ కవచా న్ని దానంగా స్వీకరించగా, అప్పుడు శివుడు శంఖచూడుడిని సంహరించ గా, అతని దేహం సముద్రంలో పడిపోయిందని, అతని భార్య తులసి, తన పాతివ్రత్య మహమతో ఆ రాక్షసుని అస్థికల నుండి మహాశంఖం ఉద్భవింప చేసింది అని చెప్పబడింది. దానిని విష్ణువు స్వీకరించి తనవద్దనే ఉంచుకొన్నా డు. మరియొక కథ ప్రకారం పంచజనుడు అనే రాక్షసుడు సూక్ష్మ రూపంలో, సముద్రగర్భంలో ఒక శంఖ రూపంలో నివసించేవాడు. అవసరమైనప్పుడు తన నిజరూపంలో భూమిపైకి వచ్చి జనాలను పీడించేవాడు. ఒకసారి సాందీ పని మహర్షి ఏకైక కుమారుడిని అప#హరించి మింగేశాడు.
ఆతరువాత కొంతకాలానికి బలరామ శ్రీకృష్ణులు సాందీపని ఋషి గురుకులంలో విద్యార్థులుగా చేరి, విద్యాభ్యాసం పూర్తి అయ్యాక గురు దక్షి ణగా ఏమి ఇవ్వాలని కోరగా, సాందీపుడు వారితో పంచజనుడు అప#హరిం చుకుపోయిన తన కుమారుని రక్షించి తీసుకురమ్మని కోరతాడు. బలరామ కృష్ణులు సముద్ర గర్భంచేరి, పంచజనుని వెదికి పట్టుకొని, సం#హరించి అత ను నివసిస్తుండిన శంఖాన్ని తీసుకొంటారు. కానీ అప్పటికే తమ గురుపుత్రు డు మరణించాడని తెలుసుకొని, యమలోకానికి వెళ్ళి, యముని గెలిచి, ఆ బాలకుడిని బ్రతికింపజేసుకొని, తెచ్చి తమ గురువుగారికి అప్పజెబుతారు. పంచజనుని వలన ఆ శంఖానికి ‘పాంచజన్యం’ అనే పేరు వచ్చింది. అందుకే, ”త్వం పురా సాగరోత్పన్న:”, విష్ణునా విధత:కరే/ దైవేశ్చ పూజిత సమ్యక్‌ పాంచ జన్య నమోస్తుతే” అని పూజ చేసే సమయంలో మనం చెప్పి పాంచజన్య శంఖా న్ని అర్చిస్తాము. ఈవిధమైన ఆధ్యాత్మిక భావనలతో కూడి శంఖం ప్రాశస్త్యం పొందింది. ”సముద్ర తనయా య విద్మ##హ శంఖరాజాయ ధీమ #హ, తన్నో శంఖ ప్రచోదయాత్‌.”
– డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236

Advertisement

తాజా వార్తలు

Advertisement