Wednesday, May 15, 2024

కుబ్జకు శ్రీకృష్ణుడి వరం

మధురానగరం రాజవీధు లలో సాగిపోతున్న బలరామకృష్ణు లు కుబ్జ అని పిలువబడుతున్న ఒక స్త్రీని పలురకాల మైపూతలుం చిన పాత్రను పట్టుకొని వస్తున్న దానిని చూచారు. ఆ సుగంధ ద్ర వ్యాల సువాసనలకి ఆకర్షితుడైన శ్రీకృష్ణడు ఆమెను చూచి ఓ పద్మా క్షీ! నీవు ఎవ్వరిదానవు. ఈ కలప ములు ఎవ్వరికోసం? నీ పేరేమిటీ? వాటిని మాకిమ్ము! అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావని అన్నాడు.
అందుకు ఆమె ఓ సుందరాం గుడా! నీవు బలే అందగాడివిలే! పరిహాసవచనాలు చాలును. నన్ను వేధించకు! నన్ను త్రివిక్ర అంటా రు. ఈ చందనాది మైపూతలు పూసుకొనండి ! అని వారికి మైపూ తలు ఇచ్చింది. కుబ్జ ఇచ్చిన మైపూతలు పూసుకొని శ్రీకృష్ణుడు ఆమె పట్ల ప్రసన్నుడై కుబ్జ మీగాళ్ళ మీద తన అడుగులు ఉంచి అదిమి పట్టాడు. తన చేతి రెండువేళ్లను ఆమె గడ్డం క్రింద పెట్టి ఒడలు చక్కగా సాగేటట్లు పైకెత్తాడు. అంత కుబ్జ యొక్క వంపులన్నీ పోయాయి. పిరు దులు, చనుగవ సొంపునింపగా చక్కని చుక్కలా తయారయింది. అంత ఆమె హృదయం మదనుడి బాణ సమూహంతో చెదరిపోయింది. ”మన్మధాకారా! నా యింటికి దయచేయి!” అంటూ శ్రీకృష్ణుని చెంగుపట్టుకుని లాగింది. ఓ చంద్రముఖీ నేను వచ్చిన పని సాధించిన తరువాత నీ గృహానికి వస్తాను. కోపించకుము అని ఆమెను సాగనంపాడు. కంసుని సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కలిసి కుబ్జ గృహానికి వెళ్లాడు. మోహినీ దేవతలాగా అందంతో మెరిసిపోతున్న కుబ్జను చూచాడు. శ్రీకృష్ణుని చూచిన కుబ్జ బంగారు మంచంపై కూర్చోబెట్టిం ది. ఉద్ధవుని కూడా బంగారు పీఠంపై కూర్చోబెట్టింది. శ్రీకృష్ణుని సంగమాన్ని కోరింది. సనకా దుల వంటి జ్ఞానులకు మహాత్ములకు కూడా దొరకని వాడు కబ్జకు లభించాడు. ఒకప్పుడు చందనం ఇవ్వడం వలన ఆ పుణ్యం లభించింది. కుబ్జ కోరుకున్న వరాన్ని కూడా ప్రసాదిం చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణునికి త్రివిక్ర వలన కలిగిన కుమారుడే ఉపశ్లోకుడు అనే వాడు. ఇతనే శ్రీకృష్ణుని ప్రథమ కుమారుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement