Monday, May 20, 2024

జీవితమంతా యోగమే!

”జీవితాన్ని, యోగాన్ని సరైన దృక్పథంతో చూసినపుడు జీవితం అంతా చైతన్యంగా గానీ, అధోచేతనతోగానీ చేసేది యోగమే” అంటారు శ్రీ అరవిందులు.
సమస్తము అంతరంగ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. దైవ కృపపై పూర్తి విశ్వాసం ఏర్పడినపుడు అడుగడుగునా మనము ఉచిత కర్మలనే ఆచరిస్తూ వుంటామని మనకు తెలియును. జీవితము యొక్క సర్వ విషయ కార్యకలాపాలు, పరిస్థితుల ప్రభావము ఇంకా వ్యక్తి చైతన్యముపై ఉంటుంది. ఆ విషయమును మనము ఎపుడో ఒకపుడు గ్రహించక తప్పదు. అది కేవలం మన దృక్పథంపై ఆధార పడి ఉంటుంది.
”కర్మణ్య వాధికారస్తే మాఫలేషు కథాచన
మా కర్మఫల హేతర్భూర్మాతే సంగోస్తు కర్మణి” అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో. అర్జునా! నీకు కర్మ చేయుట యందు మాత్రమే అధికారము గలదుగానీ దాని ఫలముల యందు లేదు. ఫలితాన్ని కోరి కర్మ చేయకూడదు. అంతేకాదు, చేసే కర్మలో కూడా నీకు మమకారము ఉండకూడదు అంటాడు శ్రీకృష్ణుడు.
చెట్లు మనిషికి నీడనిస్తున్నాయి. మేఘాలు వర్షిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నారు. అందుకు ప్రతి ఫలంగా ప్రకృతిలో ఏదీ మానవుడి నుండి ఫలితాన్ని ఆశించడం లేదు. కానీ మనిషి మాత్రం ఏ ఫలితము లేకపోతే అసలు పని ఎందు కు చేయాలని వాదిస్తాడు. ఏమి ఆశించకుండా మానవుడు ఎవరి కర్తవ్య కర్మలను వారు చేస్తూపోతే ఉత్తమ గతులను పొందుతారని శ్రీకృష్ణుని బోధ. ఫలితాన్ని కోరితే కోరిన ఫలితం మాత్రమే ఇస్తాడు. ఏ కోరికా లేకుండా కర్మ చేస్తే తనకేది అవసరమో అది ఇస్తాడు. చివ రికి తనను తానే ఇచ్చుకుంటాడు. మనకేది అవసరమో మనకన్నా ఆ పరమాత్మకే బాగా తెలుసు.
శ్రీ అరవిందులు యోగానికి నిర్వచనం చెబుతూ దైవాన్ని తెలు సుకోవడం, దైవంతో ఏకం కావడం, దైవాన్ని అభివ్యక్తం కానివ్వడం మన యోగ లక్ష్యం అంటారు. అదే మన కర్తవ్యము. అలా ఎవరి కర్త వ్య కర్మలను వారు నిర్వర్తించినపుడు, అన్యాయానికి, అవినీతికి ఆస్కారం ఉండదు. దానివలన ఏ సమస్యలు లేని సమాజం ఉనికి లోనికి వస్తుంది. అం దుకే మనందరం యోగస్తులమై కర్మ చేయాలి. అందులోనే మన జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా అనంతమైన సామర్థ్యం ఉంది. దాని గురిం చి అవగాహన కలిగినపుడు చైతన్యం వృద్ధి చెం దుతుంది. ఇక అపుడు పనులన్నింటినీ ఉత్సాహంగా చేయగలము. మనస్సు ద్వారా చేసే కర్మలు బాహ్యంగా ఉంటాయి. అంతర్ముఖం అయినపుడు చైత్య పురుష ఆధీనంలో భౌతికం, ప్రాణికం, మానసి కం, అస్తిత్వమంతా పనిచేయడం ద్వారా కర్మలన్నింటినీ ఉన్నత చైత న్యంతో చేయగలము. ఇపుడున్న మన సాధారణ చైతన్యాన్ని ఒక ఉన్నత చైతన్యా నికి విస్తరింప చేసినపుడు జీవితంలో మనం నిర్వ ర్తించే ప్రతి కార్యంలో మన సామర్థ్యం పెరుగుతుంది. మన చేతనత్వ మును దైవంతో సంయోజనం కావడమే యోగసారం.
భగవంతుడికి మనని మనం సంపూర్ణ సమర్పణ చేసుకోవల యును. ప్రతి పనిని, ప్రతి ఆలోచనని, మన నిత్య జీవిత చర్యలన్నిం టినీ దైవమునకు సమర్పించుకోవలయును. ఇక అపుడు ”దైవ సంక ల్పమే మన సంకల్పము”గా మారుతుంది.
”ప్రశాంతంగా, నిశ్చలంగా జీవించడమనేది దైవం యొక్క ఉనికిని తెలిపే తొట్టతొలి సంకేతం. ఎంత ప్రకాశంగా, నిశ్చలంగా ఉంటే అంతగా దైవానికి చేరువ అవుతాము” అంటారుశీమాత.
ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంటుంది. అంతర్ముఖం అయి న పుడు దానిని కనుగొనవచ్చును. అనుక్షణం మనం ఎరుతో జాగ రూకులమై ఉండాలి. ఏ పని ప్రారంభించాలన్నా, ఏదైనా మాట్లాడా లన్నా ఒక్క అడుగు వెనక్కి తగ్గి, ఒక్క క్షణం ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలి. ఆవిధముగా చేసినపుడు మనలో శాంతి, ప్రశాంతత, సమత్వము ఏర్పడి కర్తవ్యాలను ఉన్నతమైన చైతన్యంతో నెరవేర్చ గలము. నిశ్చల నీరవతలో సరైన వ్యక్తి గత దృక్పథంలో విషయ ములన్నీ సర్వోత్పన్నముగా జరుగును. వృధా ప్రసంగములను మానుకోవలయు ను. అనవసరమైన మాటల వలన సత్తాలో అశాంతి ఏర్పడటమేకాక సమయం వృధా అవుతుంది. అంతేకా కుండా అది మన చేతనను దిగజారుస్తుంది. అనుక్షణం ఎరుకతో మెదులుతూ కర్మలను చేయడం ద్వారా బాహ్యంలో కూడా శాంతి నెలకొనును. ఈవిధముగా సాధన కొనసాగిస్తూపోతే, చైతన్యం వృద్ధి చెంది, బాహ్య జీవితము కూడా రమణీయంగా కొనసాగి స్తాము. ఆవిధముగా జీవితమంతా యోగముగా మారును.
యోగ సాధనతో మన చైతన్యం విస్తారమైన కొలది విశ్వాత్మను కనుగొనవచ్చును. విశ్వాత్మ చేతనత్వంతో సత్య రూపమైన పరమా త్మను తెలుసుకోగలుగుతాం. అపుడు విశ్వాత్మలో తాను ఒక భాగ మేనని తెలియును. ఏకత్వ భావనలో ఆనందం మినహా దు:ఖం అనేది ఉండదు. దైనందిన జీవితంలో మనం నిర్వర్తించే ప్రతి చర్య ను పరమాత్మకు సమర్పితం చేయాలి. ఎల్లవేళలా మన చైతన్యం పరమాత్మ చైతన్యంతో ఐక్యత చెందేలా చూడాలి. అపుడు నిరంతర దైవ సంయోజనం ద్వారా జీవితమంతా యోగమే అవుతుంది.
– కవితా శ్రీధర్‌ ,93955 11193

Advertisement

తాజా వార్తలు

Advertisement