Sunday, May 5, 2024

కర్మ ఫలం నుండి తప్పించిన సాయిబాబా

ఈకలియుగం పాపభూయిష్టమైన యుగం. మానవులు అనుక్షణం తెలిసో తెలియకో మన సా, వాచా, కర్మణా ఎన్నో పాపాలను చేస్తుంటారు. నాటిన విత్తనపు పంటే మనకు లభిస్తుందని వీరు ఈ జన్మలో చేసే పాపాలను ఇక్కడే అనుభవించవలసి వుం టుంది అన్నది ఆర్యోక్తి. ఒకవేళ పాప నిష్కృతి కాని పక్షం లో తిరిగి మరొక జన్మ ఎత్తి మిగిలిన పాపాలను మనమే అనుభవిస్తాము. అందువలన మంచి జన్మ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేసు కోవాలి. ఈ విధంగా మానవుడు తాను చేసే కర్మల వలన జనన మరణ చక్ర భ్రమణంలో చిక్కు కొని అవ్యక్తమైన ఆనందానికి ఆవాసమై న ఆ భగవంతుని సన్నిధికి శాశ్వతంగా దూరమౌతున్నాడు. అందుకే ముం దుముందు మంచి జన్మలు ఎత్తాలంటే ఇప్పుడు సత్కర్మ లు చేయవలసి వుంటుంది.
సర్వ సమర్ధుడైన గురువు మనకు లభిస్తే ఆ గురువుకు సర్వస్య శరణాగతి ఒనరించి, భక్తిశ్రద్ధలతో సేవించి, ఆయన అపూర్వమైన అనుగ్రహానికి పాత్రులము కాగ లిగితే ఆ సద్గురువు మన కర్మ ఫలాన్ని తాను స్వీకరించి మనల్ని కర్మ ఫలం నుండి బంధవిముక్తులను చేస్తారు. కాని ఈ కలియుగంలో ఇది బహు అరుదైన విషయం. ఎందుకంటే అనుక్షణం సంశయాత్మక ధోరణిలో ఆలోచి స్తూ వ్యవహారిక ప్రపంచం లో జీవించే మనకు ఆ గురు వును అవ్యభిచారిణీ భక్తితో సేవించడం కడు దుర్లభం. అందుకూ మనవంటి సాధారణ భక్తులకు కష్టాలను, సమస్యలను రప్పించి కర్మ ఫలాన్ని అనుభవింపజేసి తద్వారా మనలను మన సద్గు రువులు బంధవిముక్తు లను చేస్తుంటారు. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని బలవంతంగా ముగింపజేసుకొని తద్వారా కర్మఫలం నుండి తప్పించుకో జూసిన ఒక భక్తుని రక్షింప జేసి వానికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన వైనం ఇప్పుడు మనం చూద్దాం.
మహారాష్ట్రలోని పూనే నివాసి అయిన గోపాల నారా యణ అంబాడేకర్‌గారు బాబా భక్తుడు. అబ్కారీ సంస్థలో 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఠాణా జిల్లాలో, జవ్వార్‌ ఎస్టేట్‌లోను ఉద్యోగములను చేసాడు. ఈ ఉద్యోగము లేవీ తనకు సంతృప్తినివ్వలేదు. అందు వచ్చే తక్కువ జీత ముతో తన కుటుంబమును పోషించుకోవడం చాలా కష్టమయ్యేది. ఆతను ప్రతీ సంవత్సరం శిరిడీకి పోయి బాబాను దర్శించుకొని తన కష్టాలను విన్నవించుకొని తన కు ఒక మంచి ఉద్యోగం ఇప్పించవల్సిందిగా హృదయ పూర్వకంగా ప్రార్ధించేవాడు. బాబా అతని ప్రార్ధనలను విని మౌనంగా వుండేవారు. బహుశా గత మరియు ప్రస్తుత జన్మల పాప ఫలములను అతని చేత అనుభవిం పజేయడమే బాబా ఉద్దేశ్యం కావచ్చు.
1916వ సంవత్స రంలో అంబాడేకర్‌ పరిస్థితి బాగా దిగజారిపోయింది. అతడు భార్యతో కలిసి శిరిడీకి వచ్చి కొన్ని నెలలపాటు వుండి బాబా సేవ తీవ్రతరం చేసాడు. ఒకరోజున అతను రాత్రివేళ ఒక ఎడ్ల బండిపై కూర్చొని పక్కనే వున్న నూతిలో పడి ప్రాణత్యాగం చేయ నిశ్చ యించుకున్నాడు. ఆఖరు దశలో బాబా నామ జపం చేసు కుంటుండగా ఆ ఊరిలో వున్న ఒక హోటల్‌ యజమాని, బాబాకు గొప్ప భక్తుడైన సగుణ మేరునాయక్‌ అతని వద్ద కు హఠాత్తుగా వచ్చి అక్కల్‌కోట్‌ మహారాజ్‌గారి చరిత్ర ను చదవమని చెప్పి పుస్తకాన్ని అంబాడేకర్‌కు ఇచ్చాడు. అంబాడేకర్‌ ఆ పుస్తకాన్ని అనాలోచితంగా తెరువగా ఒక కథ వచ్చింది. అక్కల్‌కోట్‌ మహారాజు అయిన స్వామి సమర్ధ కాలములో ఒక భక్తుడు బాగుఅవని ఒక విచిత్ర వ్యా ధితో బాధపడుతుండేవాడు. ఎన్ని వైద్యాలు చేయించుకున్నా అవి నిష్ప్ర యోజనమయ్యాయి.
ఇక తాను పడే బాధలను సహంచలేక ఆ భక్తుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. వెంటనే స్వామి సమర్ధ ప్రత్యక్షమై ఆ భక్తుని రక్షించి ”గత జన్మ పాపపుణ్యములను నీవే అనుభవించక తప్పదు. ఖర్మను అను భవించక ప్రాణ త్యా గము చేసినచో మిగిలిన కర్మ ఫలితాన్ని అనుభవించుటకు నీవు మరొక జన్మను ఎత్తవలసి వుంటుంది. ప్రాణత్యాగం చాలా పాపము. ఆది బ్రహ్మ హత్యతో సమానం” అని హతబోధ చేసారు.
సమయోచితంగా వున్న ఈ కథను చదవగానే అం బాడేకర్‌కు వెంటనే జ్ఞానోదయమయ్యింది. బాబా తనకు ఏవిధంగా ఉపదేసమునందించి తన జీవితాన్ని కాపాడా రో గుర్తించాక మనస్సు బాబా పట్ల భక్తితో నిండి పోయిం ది. కళ్ళు ఆనందబాష్పాలతో చెమర్చాయి. ఆ రోజు నుండి బాబా సేవను, ఆరాధనను మరిం త హచ్చిం చాడు. అటు తర్వాత బాబా అతనిని జ్యోతిష్యమును చదవమని సలహా ఇచ్చారు.
బాబా సలహాను అనుసరించి అంబాడేకర్‌ జ్యోతి ష్య శాస్త్రమును చదివి, అందులో ప్రావీణ్యం సంపాదించి తద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు. అచిరకాలం లోనే అంతులేని సిరిసంపదలు అంబాడేకర్‌గారి వశ మయ్యాయి. సంపదలతో పాటే అతనికి బాబా యందు భక్తి శ్రద్ధలు కూడా పెరిగాయి.
కష్ట నష్టములు, ఆందోళనలు, సమస్యలు ఎన్ని చు ట్టుముట్టినా మన సద్గురువు యందు నమ్మకం, విశ్వాసం రవ్వంత కూదా సడలకూడదని, ఎంత భక్తి శ్రద్ధలతో, బాబా ప్రబోధించిన శ్రద్ధ, సబూరిలతో ఆ సద్గురువును కొలుస్తూ సాధన చేస్తే అంత త్వరగా మనము ఆ సద్గురువు కరుణా కటాక్షములకు పాత్రులమౌతామని, తద్వారా మనిషి కష్టాలు అన్నీ శాశ్వతంగా దూరమౌతాయని ఈ లీల ద్వారా మనకు అవగతమౌతోంది.
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు

Advertisement

తాజా వార్తలు

Advertisement