Sunday, May 26, 2024

మన సంప్రదాయాలు…

ఆచారాలు, సంప్రదాయాలు… మన పూర్వీకులు మనకోసం పొందుపరిచిన నిధులు. ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల అభిప్రాయం. అందుకు కారణాలు మన ఆచార వ్యవహారా లే. భారతదే శంలోఉన్నా, మరే ఇతర దేశంలో ఉన్నా స్వదేశీయుడైనా, విదేశీయుడైనా, చిన్నవాడైనా, పెద్దవాడై నా అందరి నోటా వినిపించే ఏకైక మాట ‘ఇండియన్‌ కల్చ ర్‌’, ‘భారతీయ సంస్కృతి’. వేరే ఏ ఇతర దేశమైనా తమ దేశం పేరు పెట్టి ఉచ్ఛ రించడానికి సంశయించే కల్చర్‌ అన్న పదానికున్న గౌరవం ఒక్క భారతదేశానికి మాత్రమే దక్క డం వెనక ఉన్న కారణం భారతీయ సంస్కృతి, చరిత్ర మన కందించిన దేవాలయాలు, మందిరాలు. ఆచార వ్యవహా రాలు. పురాతన కాలం నాటి ఆచార వ్యవహారాలను వీడ కుండా వాటి ని చెక్కుచెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. వాటి మనుగడ కోసం క్రమశిక్షణతో కృషి చేస్తున్నారు. తమతమ వారసుల కు వాటి ఔన్నత్యా న్ని చాటి చెబుతున్నారు. ఆ సంప్రదాయాలను కాపాడు కుంటూ వస్తున్నారు. సంస్కృతీ సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాటుతున్నారు. అయితే అతివాదంతో అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తు న్నాం. మన ఆచారాలు మన పూర్వీకుల అంతరార్థాలు తెలుసుకుందాం.
మన పెద్దలు చేసిన ప్రతి పనికి ఒక ఆరోగ్య సూత్రం ఆధారంగా రూపొందించారు. స్త్రీలు గాజులు ధరించటం మనకు ఒక ఆచారం. ఆ గా జులు ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజు లు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడంవల్ల బీపీ కూడా కంట్రోల్‌ లో ఉంటుంది.
చిన్నారులకు చెవులు కుట్టిస్తారు. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మా టకొస్తే కొంతమంది మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్‌ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యా లు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.
హిందూ సంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మట్టెలు ధరి స్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్‌ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్తప్రపసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మట్టె లు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్‌ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది.
నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకూడదని అంటారు. ఎందు కంటే భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఒకవేళ మనం ఉత్తరం దిశగా తల ను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్‌ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జిdమర్స్‌, పార్కిన్‌ సన్స్‌ డిసీ జ్‌ వంటి వ్యాధులు వస్తాయట. కాబట్టి తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించ కూడదని అంటారు.
మన సనాతన ధర్మాల్లో మహిళలు నుదుట కుంకుమ ధరించడానికి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. కానీ ఇప్పుడు అలంకారంలా మార్చి స్టిక్కర్స్‌ పెట్టుకుంటున్నారు. కుంకుమ తిలకం పసుపు, పటిక, నిమ్మరసంల మిశ్ర మం. నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్‌ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.
అలాగే మనం ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేస్తాం. మూల విరాట్‌ను దర్శించుకుంటాం. భూమిలో ఎక్కడైయితే ||-షసుn- & పశగn|ష- తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్‌ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాల కు -శషశాష గా పనిచేస్తాయి. మనం గుడి చుట్గినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాల య దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు శస-ఠష|-షషస| మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని షట్‌ చక్రాలను ప్రభా వితం చేస్తాయి.అంతేకాదు ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళాలని కొందరు అంటారు. అది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహస్తాయని.
ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేసి గర్భగుడి దగ్గరకు వెళ్ళి మూలవిరాట్‌ను దర్శించుకుంటాం. అకి గర్భగుడి ద్వారానికి ఒకవైపుకు నిలబడి దేవుడిని దర్శించాలని అంటారు. ఎందుకంటే గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.
అలాగే విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. వాటిని తీసుకోవడం మంచి ఫలితా లనిస్తుంది. దేవుడికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు. పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అందుకే హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి అంటారు. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
దేవాలయాల్లో ఇచ్చే తీర్థంలో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.
ఆలయంలో కొబ్బరికాయను కొడతాం. కొబ్బరికాయ స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.
మనం చదివే దైవప్రార్థనలు, మంత్రాలు మన నాడీ వ్యవస్థపైన మం చి ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు మనం ఒక ఫోన్‌ నెంబర్‌ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పద్ధ³తిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానేని ఆక్టివేట్‌ చేసి డేటాని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి షసు లను ఉత్తేజపరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement