Thursday, April 18, 2024

స్టార్ హీరోల‌పై ఫైర్ అయిన.. న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖి

రూ..100కోట్లు తీసుకునే స్టార్ హీరోల‌తో సినిమాలు దెబ్బ‌తింటున్నాయ‌ని మండిప‌డ్డారు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖి సినిమా బ‌డ్జెట్ ప‌రిమితికి మించి పెరిగిన ప్ర‌తిసారీ ఆ సినిమాలు ఫ్లాప్‌లుగా మిగులుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చిన్న బ‌డ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌లం కావ‌డం లేద‌ని ఓ వార్తా సంస్ధ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌వాజుద్దీన్ సిద్దిఖి గుర్తుచేశారు. బాక్సీఫీస్ లెక్క‌ల గురించి అంచ‌నా వేయ‌డం నిర్మాత బాధ్య‌త‌ని పేర్కొన్నారు.

సినిమా టికెట్ సేల్స్ గురించి న‌టుడికి ఎలాంటి ప‌ట్టింపులూ అవ‌స‌రం లేద‌న్నారు. అస‌లు న‌టులు బాక్సాఫీస్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇది న‌టుల‌ అవినీతి కింద‌కే వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. సినిమాల ప‌రాజ‌యంలో న‌టులు, డైరెక్ట‌ర్లు, ర‌చ‌యిత‌ల వైఫ‌ల్యం లేద‌ని సినిమా బ‌డ్జెట్ దాని హిట్‌, ఫ్లాప్‌ల‌ను నిర్ణ‌యిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.మంచి కంటెంట్ ఉన్న సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అవుతుంద‌ని అన్నారు. నావ‌ద్ద కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఉన్నా స‌రైన ఐడియా లేకుంటే అది చిల్ల‌ర డ‌బ్బుల స్ధాయికి కుదించుకుపోతుంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement