Sunday, May 12, 2024

వెూక్షవిద్యకు మూలపీఠం కాంచీపుర క్షేత్రం!

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా!
పురీ ద్వారావతీచైవ సప్తైతే మోక్ష దాయకా:!!

భారతదేశంలో గల సప్త మోక్షపురులలో ఒకటై, దక్షిణదే శంలో గల ఏకైక క్షేత్రం కాంచీక్షేత్రం. అది మోక్షవిద్యకు మూ లపీఠం. అద్వైత విద్యకు ఆధార స్థానం. ఆదిశంకరులు అధి ష్టించిన కామకోటిపీఠ వైభవంతో ఆ నగర శోభ మరింత దేదీ ప్యమాన మయింది. ఆదిశంకరుల నుండి నేటి వరకు అవిచ్చి éన్నంగా కామకోటి పీఠ జగద్గురు పీఠపరంపరను సాక్షాత్క రింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాసభూమి.
‘కాంచీ’ అనగా మొలనూలు, వడ్డాణం. మొత్తం భారత భూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహముక్తి నందిన పుణ్యస్థలం.
దేవర్షి అయిన అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ, కాంచీ క్షేత్రా నికి విచ్చేసి శ్రీ కామాక్షిదేవిని పూజించాడు.
”కామాక్షీ సదశ్రీదేవీ, నాస్తి మంగళ దేవతా”
శ్రీరామచంద్రుడు సీతా వియోగంతో అడవిలో సంచరి స్తూ కాంచీ పట్టణానికి వచ్చి, అగస్త్య మహాముని వాక్యాన్ని పా టించి, ఇచ్చట ఈశ్వరార్చన చేశాడు.
సర్వతీర్థం- కంచికి పశ్చిమంగా ‘సర్వతీర్థం’ సరస్సు ఉన్నది. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమైన సార్థకమైన పేరు కలిగిఉన్నది.
ఆమ్ర వృక్షం- కంచిలో ఉన్న ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టు రూపంలో ఆవిర్భవించాయి. దీనివ ల్లనే ఇచటి ఈశ్వరునికి ‘ఏకామ్రేశ్వరుడ’నే పేరు ప్రసిద్ధమైంది. 3,500 సంవత్సరాల వయసుగల ఈ వృక్ష దర్శనం సర్వసిద్ధు లను ప్రసాదిస్తుంది. నేటికీ ఈ వృక్షాన్ని కన్నులారా కాంచి సేవించుకోవచ్చు.ఈ మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంప తులు ఈ చెట్టు కిందపడే పండు తీసుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ప్రస్తుతం ఈ మామిడి వృక్షం కాండం మాత్రమే దర్శనమి స్తుంది. ఈ కాండాన్ని అద్దాల పెట్టెలో వుంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూ ర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. శ్రీఏకామ్రేశ్వ రుడు పృథ్వీ లింగరూపంలో ఉంటాడు.
శ్రీకామాక్షి అమ్మవారు వెలసిన కాంచీ క్షేత్రం చక్రాకృతి లో నిర్మితమైంది. ఈ క్షేత్రం మధ్యభాగాన బిందు స్థానీయంగా శ్రీకామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారే ఇచ్చ టి ప్రధాన దేవత. కంచిలోని దేవాలయ విమానగోపురాలన్నీ కామాక్షీదేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి.
శ్రీరాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన ఈ తల్లి ఇక్కడ సిద్ధా సనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చత్భ్రుజ. కుడివైపు కింది చేతిలో పంచపుశ్ప బాణాలు, పై చేతిలో పాశం, ఎడమ వైపు కింది చేతిలో ఇక్షుధనస్సు, పై చేతిలో అంకుశం ధరించి ఉంటుంది.
అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు సాల గ్రామ శిలపై స్వయంగా స్వయంగా లిఖించి ప్రతిష్టించిన శ్రీచ క్రధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం.
ఇచ్చట చిదాకాశ (బిలాకశం) రూపమే అమ్మవారి కార ణరూపం అఖంద సచ్చిదానంద రూపిణి అయిన పరదేవత యొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపాలను ఇక్కడ మనము దర్శించవచ్చు.
కంచిలోని ఏకామ్రనాథుని రథోత్సవం, శ్రీవరదరాజ స్వామి రథోత్సవం మొదలైనవి, కంచిలోని ఏ దేవునకు ఏ ఉత్సవం జరిగినా అది శ్రీకామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణ రూ పంగా, అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు ప్రధాన వీధులగుండా వెళ్ళడం ఇప్పటికి అక్కడ సంప్రదాయసిద్ధమై న ఆచారం.
శ్రీవైష్ణవుల దివ్యక్షేత్రాలలో ఒకటైన విష్ణుకంచిలోని వర దరాజ స్వామి ఆలయంలో కూడా ఎనిమిది స్థంభాల మంట పంలో వేదవ్యాస, ఆదిశంకర మూర్తులు ఉన్నవి.
ఐతిహాసిక ప్రశస్తి- కాంచీక్షేత్రం వైదికధర్మ పోషణ, ప్రచా రాలకు కేంద్రస్థానమై సిం#హళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది. ప్రాచీన పురాణాల్లో ‘బ్ర#హ్మశాల’, ‘దివ్యక్షేత్రం’ అని ఈ పట్ట ణం వర్ణించబడింది. ‘నగరేషు కాంచీ’ అని కూడా ప్రసిద్ధి గాంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement