Thursday, May 16, 2024

గురువుతో చెలిమి…జన్మజన్మల కలిమి

తండ్రిని చూపెడితే, చేయి పట్టుకుని గురువును చేరుస్తా డు తండ్రి. గురువు జీవ తత్వాన్ని, జీవన తత్వాన్ని, జీవిత త త్వాన్ని ఎరుక పరుస్తాడు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుస్తాడు. మనిషిని మనీషిగా మారుస్తాడు.
గురువు ఉపదేశాలు, బోధలు, ప్రబోధలు, గుంభనంగా, గంభీరంగా అన్యోపదేశంగా ఉంటాయి. నారికేళ పాకంలా క్లిష్టంగా ఉంటాయి. కష్టంగా ఉంటాయి. కరుణ రసాభరితంగా ఉంటాయి. కనువిప్పు కలిగించేలా ఉంటాయి. గోదావరి నీళ్ళ లా స్వచ్ఛంగా ఉంటాయి. తెలుగింటి ఆడపడుచులా పవిత్రం గా ఉంటాయి. తేట తేనియ తీయందనంలా ఉంటాయి. తేనే లూరు తేట తెలుగు పదాల రసగుళికల్లా ఉంటాయి గురువు ప్రసంగాలు. అవి ఆత్మానందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక అమ ర సుఖాలను అందిస్తాయి. అద్వైతపు అంచున అమరత్వ సిద్ధికి సోపానాలవుతాయి.
గురువు ప్రబోధ ఉపనిషద్వా#హనిలా ఉంటుంది. ఒక్కో ప దం ఒక్కో బ్ర#హ్మసూత్రం అవుతుంది. ప్రతి మాటా ఒక మంగ ళ గీతమవుతుంది. ప్రతి వాక్యం ఓ సత్యకావ్యం అవుతుంది.
గురువు ఓ అనంత శక్తి! తేజోమయ దీప్తి. గురువు పలికే ప్రతి పలుకు భావికి పిలుపు అవుతుంది. జీవితానికి మలుపు అవుతుంది. గురువు బోధ ఎడారుల వంటి గుండెల గుడారాల పై అమృత బిందువులు కురిపిస్తుంది. ఆనంద సింధువుల్ని ఒలి కిస్తుంది. విశ్వప్రేమ విత్తులు నాటుతుంది.
గురువు అనురాగం #హంసకీ, క్రౌర్యానికి, కుటిలత్వానికి, ఆనవాలమైన మనసుల్లో కారుణ్య వా#హనులను ఉత్పన్నం చేస్తుంది. గురువు అనురాగం తప్పు చేసిన సొంత బిడ్డను కన్న తల్లి లాలించినట్లు, సవరించినట్లు, లాలించి సవరించి సంస్క రించి మంచిగ మారుస్తుంది. నవ జీవంతో #హృద్యంగా మన లను ముస్తాబు చేస్తుంది.
గురువులో ఓ నవ్యత ఓ ప్రత్యేకత ఓ విశిష్టత ఉంటుంది. విజ్ఞాన సర్వస్వం ఉంటుంది. సుజ్ఞాన భాండాగారం ఉంటుం ది. కుళ్ళు, కపటం, పన్నాగాలు, ఎత్తుగడలు, సంకుచిత్వం, స్వార్ధ పరత్వం, కల్లబొల్లి మాటలు, కపటపు చేష్టలు, వీటన్నిం టినీ గురువు పసికట్టి, వాటిపై తుపాకి గుళ్ళు పేల్చుతాడు. మన ల్ని నవరస భరితుల్ని చేస్తాడు.
గురువు నోటివెంట వెలువడే పదాలు పద్యాల వరదలు కా వు. మరకత మాణిక్యాల రాసులు. గురువు యిచ్చే వాక్య విభూ తి మనలో దివ్యతరంగాలు సృష్టిస్తుంది. సందేశ తరంగిణిలో తానమాడిస్తుంది. గురువు యిచ్చే నజరానా శిష్యుడి పాలిట అమూల్యమైన ఆధ్యాత్మిక ఖజానా!
గురువుతో చెలిమి జన్మజన్మల కలిమి. గురువు ప్రేమ అనే జలధిలో మనల్ని ఓలలాడిస్తాడు. అనంతమైన ఆధ్యాత్మిక అం చులను తాకిస్తాడు. అవ్యక్తమైన ఆనంద డోళికలలో ఊరేగిస్తాడు. ప్రేమ ప్రసాదాన్ని పంచుతాడు. అనిర్వచనీయమైన అనంత లోకాలలో, అమృతతుల్య విందు భోజనాలందిస్తా డు. గురువు బోధలలో చక్కిలి గిలి పెట్టే ఛలోక్తు లుంటాయి. లాస్యం పండించే హాస్యో క్తులుంటాయి. గురువు వ్యంగం బాణంలా మనసును గుచ్చుకోదు. శిష్యుడి #హృదయాన్ని #హత్తుకుంటుంది. అలౌకిక గంధాన్ని పూయిస్తుంది. సుగంధం వెల్లి విరిసే లా చేస్తుంది. మనందరి దృష్టి గురువు సృష్టించిన సృష్టి మీద ఉంటే, గురువు దృష్టి మాత్రం మన మీద ఉంటుంది. మనల్ని ఉన్న తుల్ని చేసేందుకు ప్రయత్నిస్తుంది. మన ప్రవృత్తుల్ని నివృత్తి చేసే దిశలో ఉంటుంది. గురువు దృష్టి మనలో పరివర్తన కోసం పరితపిస్తుంది. పరిశీలన చేస్తుంది. పరీక్షిస్తుంది. సంస్కరింప చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉం టుంది. మనల్ని జ్ఞానమూర్తులుగా, సుజ్ఞాన మూర్తులుగా మార్చేందుకు అనుక్షణం ఆరాట పడుతూ ఉంటుంది.
మొత్తంగా దారితప్పి తప్పటడుగులు వేసే మనల్ని, పశ్చా త్తాపాగ్నిలో పుటం పెడతాడు గురువు. పవిత్రుల్ని చేస్తాడు. పునీతుల్ని చేస్తాడు. జీవిత లక్ష్యాలను నిర్దేశిస్తాడు. జీవన గ మ్యం వైపు నడిపిస్తాడు. అంతిమ లక్ష్యాలను దర్శింప చేస్తాడు. దివ్యత్వంతో అలరిస్తాడు. మనలో పరివర్తన తెప్పిస్తాడు. కర్తవ్యం బోధిస్తాడు. మనలను ”పర”తత్త్వం వైపు పయనింప చేస్తాడు. జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్ధాన్ని ఆపాదింపజేసి మనల్ని తరింపజేస్తాడు గురువు. పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు. అతడే గురువు. సద్గురువు. జగద్గురువు. అతడు గీతాకారుడు కావొచ్చు. ఆదిశంకరులు, పరమ#హంస, పరమాచార్య ఇలా ఎవరైనా కావొచ్చు. రూపాలే వేరు. స్వరూపం ఒక్కటే!.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement