Saturday, May 4, 2024

ఆశయే జీవనాలంబన!

సృష్టికి మూలాధారమైన చలనమును ‘ఆశ’ అనే స్వభావంతో నింపాడు పరమాత్మ. మానవుని కర్మ బంధములో నడిపించేది ఆశ. సమస్త విశ్వాంతరాళ మును తన దేహముగా కలిగిన విష్ణువు తన నాభి నుండి కమలమును ఉద్భవింపజేసి బ్రహ్మను సృష్టించాడు. అనంత పద్మనాభుని నుండి ఉదయించిన విరించి తన సృష్టిలో భాగము గా ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను సృజించి అందు మానవుని ఉత్కృ ష్టునిగా రూపొందించాడు. ఆకలి తీర్చుకొనుటకు జంతు జాలమును వేటాడి పచ్చి మాంసమును భుజించి తన ఉనికి ని కాపాడుకున్నాడు ఆదిమ మానవుడు. కలియు గమున తన మనుగడకు అనుగుణంగా భగవం తుడిచ్చిన ప్రకృతిని ఉపయోగించుకొనుచున్నా డు. కార్చిచ్చు నుండి అగ్నిని పొంది గుహలలో దాచుకున్నాడు. కార్చిచ్చులో కాలిన జంతు మాంసా న్ని రుచి చూసి ఆహారాన్ని పచనం చేయడం నేర్చుకున్నా డు. మాంసానికి తేనె, దుంపలు, కొన్ని ఆకులు చేర్చి రుచు లను కనుగొన్నాడు. సమిష్టి జీవితానికి గుర్తుగా జనపదాలను ఏర్పాటు చేసుకుని, ప్రకృతి నుండి సృష్టి కార్యాన్ని గ్రహించి స్త్రీ, పురుష సంగమం తో మరొక జీవికి చోటు కల్పించి మాన వ జాతిని వృద్ధి చేసా డు. ఇది అంతయూ వ్యక్తములో మన ము పొందే భ్రాంతి లేదా అనుభూతి. కాని అవ్యక్తములో ఆశ అనే స్వభావం కారణం. త్రిగుణాత్మక ప్రకృతి ఈ మహా మాయా నాటకమునకు నేపథ్యం. అంచెలంచెలుగా ఆశతో నేటి విజ్ఞాన కాలమునకు చేరుకున్నాడు మానవుడు. మంత్ర, తంత్ర యుగాలయిన కృత, త్రేత, ద్వాపర యుగాలలో దేవ దానవ గంధర్వ మొదలైనవారు కలియుగ వాసులకంటే అద్భుతమైన జీవన కలాపాన్ని కలిగియున్నా రు. కాని కలియుగమున మానవుడు ఆశతో స్వార్దాన్ని పెం పొందింప జేసుకున్నాడు. తన ఉన్నతికి కారణమైన శక్తులను మరచి కృతఘ్నుడై అసుర స్వభావంతో సృష్టి వైరుధ్యానికి గురవుతున్నాడు. స్వీయ, దేశ రక్షణ కొరకు అనేక భయంకర ఆయుధాలను కనుగొన్నాడు. శాంతి జపం చేస్తూనే అశాంతిని కల్పిస్తున్నా డు. ఆకలి తీర్చుకోవడం, సంఘజీవిగా మసలుకోవడం, ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడం, స్త్రీ, పురుషుల ఆకర్ష ణ, సంతానాభివృద్ధి, స్వజనుల రక్షలకు కారణం ఆశ. ప్రతి ఒక్కరిని నడి పించేది ఆశ. జీవన ఆలంబన ఆశ.
ఆశ నుండి స్వార్దం జనించింది. స్వార్దం పరిమితికి లోబ డి ఉంటే ప్రమాదముండదు. ”అతి సర్వత్ర వర్జయేత్‌” అను ఆర్యోక్తి ప్రకారం అతిగా ఏదీ పనికిరాదు. పరిమితికి లోబడి చేసే జీవన కార్యకలాపాలు ప్రతీకారాన్ని కోరవు. ఎప్పుడైతే స్వార్థం మితిమీరిందో అది అనర్థానికి దారి తీస్తుంది. స్వార్దం ఎదుటివారి స్వేచ్ఛను హరిస్తుంది. క్రమంగా అది నిన్ను నాశనం చేస్తుంది.
పరిమితమైన ఆశ, స్వార్థం మనిషిని ఒక ఉత్తమ గృహ స్థుగా తీర్చిదిద్దుతాయి. తద్వారా ఉన్నత కుటుంబాలు ఏర్పడ తాయి. అవి చక్కటి సమాజాన్ని ఏర్పరుస్తాయి. పరిమితమై న ఆశతో మానవుడు జీవించినంతకాలం ఎటువంటి ప్రమా దము ఉండదు. కానీ ఆశ అత్యాశగా, అత్యాశ దురాశగా మారడంతోనే సమాజ పతనం ప్రారంభమవుతుంది. ప్రకృతి కూడా దురాశను సహించదు. తన వైపరీత్యంతో మానవ జాతిని దునుమాడుతుంది. తన సంపదను తోటివారితో పంచుకోవాలి అనే భావన లోపించడం వల్లనే అభధ్రతా భావం ప్రవేశిస్తోంది. సమస్త సృష్టి లో మానవాళి, మిగిలిన జీవులన్నీ భాగస్వాములే అన్న వసుదైక కుటుంబ భావన కరువయ్యింది. దురాశవల్ల మాన వుడు కృతఘ్నుడై తోటి మానవుని నాశనం చెయ్యడానికి అనుక్షణం ఆలోచన చేస్తున్నాడు. చివరికి భగవంతుని ఉనికిని ప్రశ్నించే దురవస్థకు చేరు కుంటున్నాడు. అనేక ప్రకృతి ఉత్పాతములు భగవదాను గ్రహంగా సంభవిస్తున్నా భయం లేకుండా తమో గుణంతో విర్ర వీగుతున్నాడు. మానవత్వం లోపించిన విజ్ఞాన శాస్త్రా భివృద్ధితో తన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
ఆశతో జీవించాలి. అత్యాశ, దురాశలను తక్షణం విడనా డాలి. సకల చరాచర సృష్టికి మూలమైన ఆ పరాత్పరు ని శక్తిని నిత్యం మననం చేసుకుంటూ జ్ఞానకరమైన ఆధ్యాత్మి క జీవ నం కొనసాగించాలి. ఈ భువిపై సకల జీవులకు స్థానం, హ క్కు ఉన్నదన్న సత్యం తెలుసుకోవాలి. అప్పుడే పరస్పర సు హృద్భావ వాతావరణం ఏర్పడి దేశ, ప్రపంచ శాంతి వర్ధిల్లు తుంది. దానికి నిరాడంబర జీవన శైలి, ప్రకృతిని ఆరాధించ డం, త్యాగం మొదలైన సద్గుణాలను ఆశగా చేసుకోవాలి. అప్పుడే భగవంతుడు కళ్యాణ వైరాగ్యమును ప్రసాదించి పరమశాంతిని కల్గిస్తాడు. లేకపోతే ధర్మ సంస్థాపనా యజ్ఞం లో అత్యాశ, దురాశాపరులంతా సమిధలుకాక తప్పదు.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement