Sunday, May 19, 2024

ఆయనకు వినోదం.. జీవుడికి సంకటం

ఆడించే వాడికి వినోదం, ఆడే వాడికి ప్రాణ సంకటం. ఎప్పుడూ ఏడవని బిడ్డను గిల్లి తల్లి ఆనందిస్తుంది ఒక్కోసారి. ఆ తర్వాత బుజ్జగించి, అక్కున చేర్చుకుని పరవశిం చి పోతుంది ఆ మాతృమూర్తి. పరమాత్ముడి క్రీడ కూడా అలాంటిదే. సుఖం, కష్టం ఒక చక్రం లాంటివి. వచ్చి పోతుంటా యి. ఏదీ ఎల్లకాలం ఉండదు. ఈ క్రమంలోనే జీవుడి పరి ణామ క్రమం, మానసిక పరిణితి ఉంటుంది. అప్పుడు తర్కించుకుం టాడు. ఇక ప్రయాణం మొదలై… ‘నేనెవరు?’ అనే ప్రశ్న తలెత్తి.. దావానలం అవుతుంది. సద్గురువుల నిర్దేశకంలో అన్వేషణ మొదలై.. మంచి, చెడు విశ్లేషణ మొదలవుతుంది. ఈ అన్వేషణలో అన్నీ గొప్పులు, గోతులే ఉంటాయి. తీవ్రమైన దెబ్బలు తగులుతాయి. అవమానా లకు అంతం ఉండదు. దూషణలు ఎదుర్కోవాలి, భూషణలు ఉండవు. నేను పవిత్రమైన భగవదాంశను అని భావించి ఆ పరతత్వ అన్వేషణ ఆపకుండా పోయే దారిలో ఇవన్నీ ఆటం కాలే. పనికిరాని వాడని, పలాయన వాదని, సన్యాసి అని.. ఎన్నో బిరుదులు ఆపాదిస్తారు. లోకం చెడ్డది కాదు, మనో ప్రవృత్తులు అలా ప్రవరిస్తుంటాయి. పడ్డవాడు చెడ్డవాడూ కాదు, అన్నవాడు పెద్దవాడూ కాదు. అన్నింటికీ సమాధానం కాలమే చెబుతుంది. కాలము అంటే పరమాత్మ. కాలకూటం.. అంటే.. పరమాత్మతో సావాసం. కాలకూటం స్వీకరిస్తే.. అంటే పరమాత్మతో సంగమం పెట్టుకుంటే వచ్చేది.. కామధేనువు, కల్పవృక్షమే కదా. సాధకు డా.. రాటుదేలు. ఏ కష్టం నువ్వు భరించలేనంత కష్టం కాదు, ఇవాళ వచ్చిన కష్టం, మానావమానాలు రాబోయే నీ ఉన్నతికి సోపానాలు. అన్నిటికి కారణమైన ఆ కాల కాలుడిని మాత్రం వదలకు. గట్టిగా పట్టుకో. వేదవాక్కు ఎప్పటికీ బీరు పోదు.

– డా. చదలవాడ హరిబాబు 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement