Monday, May 20, 2024

తల్లులకు సద్గతి నొసగిన తాపసులు

భవబంధాలు తమ ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలని భావించి యోగ సాధ న కోసం సంసార వలయంలో చిక్కుకొనక సన్యసించిన యతీంద్రులెంద రో మన పుణ్య భూమిలో అవతరించారు. అన్ని బంధాలనూ త్యజించినా తమ జన్మ కారకులైన తల్లి పట్ల తమ కర్తవ్యాన్ని మరువని ముగ్గురు మ#హనీయులను ఇప్పుడు స్మరించుకొందాం.

కపిల మహర్షి

సాంఖ్య కారికను రచించిన కపిల మహర్షి వేద కాలానికి చెందినవాడు. శ్రీమద్భా గవతం తృతీయ స్కంధం 33వ అధ్యాయంలో కపిలుని గాథ వివరింపబడింది. బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ ప్రజాపతికి, స్వాయంభువ మనువు కుమార్తెయైన దేవ#హూతికి అపురూప సౌందర్యవతులు, గుణవతులైన 9మంది కుమార్తెల తర్వాత, విష్ణు అంశతో కపిలుడు జన్మించాడు. తండ్రికి తత్త్వ జ్ఞానాన్ని బోధించి అతనికి ముక్తిని చ్చిన తర్వాత బిందు సరోవరం వద్ద ఎందరో మునులకు తత్త్వోపదేశం చేస్తూ ఋషి జీవితం గడుపసాగాడు కపిలుడు. వివాహాలు చేసుకొని కుమార్తెలు, యోగంతో జీవి తం చాలించిన భర్త, సన్యసించి కొడుకు తనను ఒంటరిని చేశారని దు:ఖపడుతున్న తల్లికి కపిలుడు యోగమార్గం ఉపదేశించాడు. తాను బోధించిన యోగ మార్గాన్ని అనుసరిస్తే-
”జీవన్ముక్తి లభించున్‌
కావున నేమరక తలపు గైకొని దీనిన్‌
వావిరి నొల్లని వారికి
తావలమగు మృత్యు భయము, దవ్వగు సుఖమున్‌”
అని తల్లికి ఉపదేశించాడు. దాదాపు శతాధిక పద్యాలలో విస్తరించిన ఈతత్త్వ బోధ సకల జనులకు ఉపాస్యమానమైనది. తన కొడుకు చెప్పిన యోగ మార్గాన్ని పర మ నిష్ఠతో అనుసరిస్తూ కపిలుని తల్లి అఖండ వైరాగ్య సిద్ధిని, బ్రహ్మజ్ఞానాన్ని పొందగ లిగింది. అంత్యకాలంలో ఆమెకు ముక్తి లభించింది. ఎక్కడైతే ఆమె పరమపద సిద్ధి పొందిందో ఆ ప్రాంతం ”సిద్ధి పదం” అనే పేరుతో పవిత్ర క్షేత్రమై విరాజిల్లింది. ఈవి ధంగా తల్లికి తత్త్వోపదేశం చేసి ఆమె దు:ఖాన్ని ఉపశమింప జేయడమేకాక, అంత్య కాలంలో ఆమె మోక్ష ప్రాప్తికి కారకుడయ్యాడు కపిల మ#హర్షి.

ఆదిశంకరాచార్యులు
వేద సంస్కృతిని పునరుద్ధరించి, అద్వైత మతాన్ని స్థాపించడానికి సాక్షాత్తు పరమ శివుడే, శివగురువు, ఆర్యాంబ దంపతులకు కొడుకుగా కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు ఆదిశంకరాచార్యులు. మూడవ ఏట తండ్రి శివగురువు మరణించగా, అన్నీ తానై కొడుకును పెంచింది ఆర్యాంబ. శంకరునికి కూడా తల్లి పట్ల మమకారం ఉండేది. ప్రతి రోజు తల్లి పూర్ణానది వరకు స్నానం కోసం ప్రయాసపడి వెళ్ళడం గమ నించి ఆ నది పాయను తన ఇంటి వద్దకే తెప్పించిన మాతృభక్తి పరాయణుడాయన. తన ఐదవ ఏట ఉపనయనం జరిగాక గోకర్ణ క్షేత్రంలో సాంగోపాంగంగా వేదాలను అభ్యసించాడాయన. భవ బంధాలను వద్దనుకొని, సన్యాసం స్వీకరించాన్న బలమైన కోరికతో, నదిలో తన కాలు మొసలి పట్టుకొందనీ, సన్యాసం స్వీకరిస్తే తప్ప అది వదల దని తల్లికి నచ్చజెప్పి ఆతుర సన్యాస దీక్షను చేపట్టాడాయన. తనను వదిలి వెడుతున్న కొడుకును పట్టుకొని దు:ఖిస్తున్న తల్లికి ఆమె అవసాన కాలంలో చెంత ఉండి సర్వకర్మ లను నిర్వహస్తానని హామీ ఇచ్చి ఆమెకు తత్త్వ బోధ చేసి వెళ్ళాడు.
ఆదిశంకరులు ఉత్తర భారతదేశ పర్యటనలో ఉండగా తల్లికి తుది ఘడియలు ఆసన్నమైన విషయం దివ్య దృష్టితో తెలుసుకొని, ఆమె చెంతకు వచ్చి సపర్యలు చేయ డమేకాక, ఆమెకు ఇష్టమైన బాలకృష్ణుని దివ్య దర్శనము చేయించి, ఆమెకు సునా యాసమైన మరణాన్ని కలిగించారు. తల్లి దేహత్యాగం తర్వాత ఆమె అంతిమ సంస్కా రానికి పూనుకోగా, సన్యాసికి కర్మాధికారం లేదని బంధువులు, ఇతరులు అడ్డుకొన్నారు. అయినా వెనుదీయక శంకరుడు యో గాగ్నితో తల్లికి సమంత్రకంగా ఉత్తర క్రియలు నిర్వహంచారు. ”నమాతు: పర దైవతమ్‌”. తల్లిని మించిన దైవం లేదన్న శాస్త్ర వాక్యాన్ని అనుసరించి, లోకాన్ని ఎదిరించి మరీ మాతృ ఋణం తీర్చుకొన్న ధన్యుడాయన. సాక్షాత్తు పరమేశ్వరాంశ అయిన కు మారునితో అంత్యేష్ఠి జరిపించుకొన్న అదృష్టశాలిని ఆర్యాంబ.

భగవాన్‌ శ్రీ రమణ మ#హర్షి

- Advertisement -

ఆధునిక యుగంలో పరమ యోగిగా, భగవాన్‌గా, మహ ర్షిగా సుప్రసిద్ధుడైన శ్రీ రమణ మహర్షి తన పదహారేళ్ళ వయ సులో ఐహక విషయాలను త్యజించి, అరుణాచలం చేరి, అక్కడి అరుణగిరి గుహలలో తపో నిష్ఠలో, ధ్యాన సమాధిలో కొన్ని సంవత్సరాలుండి పోయారు. రమణుల జాడ తెలిశాక, ఆయన పినతండ్రి నెల్లియప్ప అయ్యర్‌, అరుణాచలానికి వచ్చి, రమణు లను తన వెంట ఇంటికి రమ్మని పరిపరి విధాల కోరినప్పటికీ రమణులు స్పందించలేదు. ఆయన ఆ విషయాన్ని రమణుల తల్లి అళగమ్మకు తెలిపారు. కొడుకుపై అవ్యాజ్యమైన ప్రేమ కలి గిన ఆ తల్లి తాను ఎదుట నిలబడి పిలిస్తే తన వెంట తప్పక వస్తాడన్న ఆశతో వెంటనే అరుణాచలం చేరినది. స్వామి స్పందించలేదు. ఒక కాగిత ముపై ”జరిగేది ఎవరు ఎంత అడ్డుపెట్టినా జరుగక మానదు. జరుగనిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరుగదు. ఈ సత్యం తెలుసుకొని మౌనంగా ఉండటమే ఉత్తమం” అని వ్రాసి తల్లికి చూపారు. దాని తో నిరాశ చెంది ఆమె వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అళగమ్మ రమణుల సన్నిధికి వస్తూ పోతూ రాకపోకలు సాగించారు. తల్లిని తన ఆశ్రమంలోని ఇతర భక్తులతో సమానంగా చూస్తూ, ఆమెకు అడుగడుగునా తత్త్వ బోధ చేస్తూ, ఆమె మూఢ విశ్వాసాలను పరిహసిస్తూ, మాట వినకపోతే ఊరికి వెళ్ళి పొమ్మని కోపం నటిస్తూ, ఆమెలో చాలా పరివర్తన కలిగించారు శ్రీరమణులు.
ఒకమారు తల్లికి తీవ్రమైన జ్వరం రాగా, రమణులు ఆమెకు సపర్యలు చేసి, ఆమె కు స్వస్థత చేకూర్చమని భగవంతుని కోరుతూ, తమిళంలో కొన్ని పద్యాలు కూడా రచించారు. ఆరోగ్యం చేకూరాక తన ఊరికి వెళ్ళిన ఆ తల్లి మరలా 1916లో అరుణా చలం చేరి శ్రీరమణుల వద్దనే చరమ జీవితం గడపసాగారు. తర్వాత నాలుగేళ్ళకు ఆమె ఆరోగ్యం క్షీణించగా స్వయంగా తల్లికి సేవలు చేస్తూ, వేదాంత సారాన్ని బోధిస్తూ గడిపారు. చివరగా తమ కుడి చేతిని తల్లి #హృదయం మీద, ఎడమ చేతిని ఆమె శిరస్సు పైన ఉంచి, తదేక దృష్టితో ఆమెను చూస్తూ, తమ హస్తదీక్షతో తమ ఆత్మశక్తిని ఆమెలో నికి ప్రవేశపెట్టి, ప్రాణ శక్తులు బహర్గతం కాకుండా ఆమెకు ముక్తిని ప్రసాదించారు రమ ణ మహర్షి. కైవల్యం పొందిన ఆమె శరీరాన్ని సమాధి చేసి, దానిపై అప్పుడే కాశీ నుండి తీసుక రాబడిన శివలింగాన్ని స్థాపించి, మాతృభూతేశ్వరాలయం అని నామకరణం చేశారు ఆశ్రమవాసులు. ఇలా సర్వసంగ పరిత్యాగులై, జగద్గురువులై ఉండికూడా ఆ మహనీయులు తల్లుల పట్ల భక్తి గౌరవాలను చూపుతూ, బాధ్యతలను నిర్వర్తించి,
లోకానికి మార్గదర్శకు
లయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement