Tuesday, October 15, 2024

శివుడు బాలుణ్ణి సంహరించాడా

పురాణ కథల్లో కొన్ని అసంబద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. వాటికి విజ్ఞులు వివరణ కూ డా ఇస్తుండటం చూస్తాము. అందుకే పురాణ కథలన్నింటిని కేవలం కథా భాగంగానే తీసుకోరాదని వాటిలోని అంతరార్థాన్ని గ్రహించాలని విజ్ఞులు చెబుతుంటారు. ఇలాంటి అసంబద్ధంగా కనబడే కథలలో వినాయక చవితి సందర్భంగా చదివే వినాయకోత్పత్తి కథ ఒకటి. వినాయకుడు పుట్టినది పార్వతీదేవి వాడిన నలుగుపిండి నుంచి అనే కథ ఉంది. నలుగుపిండి నుంచి రూపొందించిన రూపానికి జగన్మాత ప్రాణం పోసిందని, బాలకుడి రూపంలో ఉన్న అతనిని ద్వారం వద్ద కాపలా గా ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వవద్దని ఆదేశించిందని కథ. ఈలోగా పరమేశ్వరుడు రావడం ఆయన ఎవరో తెలియని వినాయకుడు అడ్డగించడం, శివుడు ఆగ్రహించి త్రిశూలంతో అతని తల తెగ నరికాడని, లోపలకు వెళ్ళి మామూలుగా పార్వతీదేవితో ముచ్చటించి మధ్యలో బయట తాను సంహరించిన బాలకుడి సంగతి ప్రస్తావించగా పార్వతీదేవి విషయం తెలుసుకుని విలపిం చిందని ఆయన గజాసురుని తల త్రిలోక మద్యం కావాలి కనుక దానిని తెచ్చి ఆ బాలకునికి అతికించి తిరిగి ప్రాణం పోశాడని ఆ కథ.
ఈ కథలో అసంబద్ధత ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ సందర్భంగా ఈ కథ చదవడం, అసంబద్ధత అర్థం కాలేదని కొందరనడం మామూలే. శివుడంతటివాడు రావడం తనను అడ్డగించిన బాలుడిని మరో ఆలోచన చేయకుండా సంహరించడం, అవేమీ పట్టనట్టు పార్వతీదేవితో మామూలుగా ముచ్చటించడం అసంబద్ధమే. దీనిని చాలామంది ఎత్తి చూపిన సందర్భాలు ఉన్నాయి. ఒక సినీ ప్రముఖుడు కూడా దీనిని ప్రసావించి, విమర్శించిన సంగతి కూడా గతంలో జరిగింది. అయితే ఈ కథకి కొందరు పెద్దలు బాలకుడు అహంకారానికి ప్రతీక అని, అది పనికి రాదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని, ఇంకా మరికొన్ని వివరణలు ఇచ్చారు. అయితే ఈ కథకు అంతగా ప్రచారంలోనికి రాని ఒక వివరణ కూడా ఉంది. ఒక ఆధ్యాత్మిక వేత్త కూడా దానినే ధృవీకరించారు.
ఆ వివరణ ప్రకారం పార్వతీదేవి రూపొందించిన బాలకుణ్ణి శివుడు సంహరించలేదు. ఆ బాల కుని మరింత శక్తివంతం చేయాలని భావించాడు. అంతవరకు అమ్మవారి శక్తినే సంతరించుకున్న ఆ బాలునికి తన శక్తిని కూడా జోడించాలని భావించాడు. ఆ మేరకు అతనికి తన శక్తిని జోడించి అతనికి గజాసురుని తలకి వంద్యత కల్పించేందుకు దానిని అమర్చాడు. ఆ రూపాన్ని మార్చడాన్ని తలను శివుడు నరికి వేయడంగా కొందరు భావించినందున ప్రస్తుతం ఉన్న కథ పుట్టి ఉంటుంది. అదే ప్రచారాన్ని పొందింది. ఇంకా లోతుగా పరిశీలిస్తే ఇందులోను ఇంకా అసంబద్ధంగా ఉన్నట్టు గా కనిపించే పురాణ కథలలో ఎన్నో రహస్యాలు…
అంతరార్థాలు కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement