Sunday, May 19, 2024

గీతాసారం(ఆడియోతో….)

అధ్యాయం 7. శ్లోకం 20

కామైస్తై సైర్హృతజ్ఞానా:
ప్రపద్‌తే న్యదేవతా: |
తం తం నియమమాస్థాయ
ప్రకృత్యా నియతా: స్వయా ||

తాత్పర్యము : విషయకోరికలచే జ్ఞానము అపహరింపబడినవాడ, ఇతర దేవతలకు శరణమునొంది తమ గుణములను బట్టి ఆయా పూజావిధానములను అనుసరింతురు.

భాష్యము : భౌతిక భావనల నుండి పూర్తిగా ప్రక్షాళన చెందిన వారు భగవంతునికి శరణు పొంది ఆయన సేవను చేయుదురు. అలా భౌతిక ప్రక్షాళన పూర్తి కాకపోతే వారు ఇంకా భక్తులు కానట్లే లెక్క. అయితే వారు భగవంతుణ్ణి ఆశ్రయించటమనే, సరైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు కాబట్టి త్వరలోనే కామము నుండి దూరమవుతారు. కాని ఎవరైతే రజోగుణము, తమో గుణములలో నుందురో వారు సత్వరమే కోరికలను తీర్చుకొనుటకు తెలివితక్కువ తనముతో
దేవతలను పూజిస్తూ సంతృప్తి చెందుదురు. వారు జీవిత లక్ష్యాన్ని సాధించుట ఎట్లో తెలియక కొద్దిపాటి కోరికలను తీర్చుకొనుటకు తప్పుదోవ పట్టుదురు. వారు తమ కష్టాలనను తీర్చుటకు దేవాదిదేవుని కంటే దేవతలను ఆశ్రయించటమే మేలు అని భావించుదురు. అయితే శుద్ధ భక్తుడు, దేవాది దేవుడు ఒక్కడే అందరికి ప్రభువనీ, మిగిలిన వారందరు ఆయన దాసులని, అతడు భగవంతుని మీదే ఆధారపడి, ఆయ ఇచ్చిన దానితో సంతృప్తి చెందుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
Advertisement

తాజా వార్తలు

Advertisement