Monday, October 7, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 31
31
యదా భూతపృథగ్భావమ్‌
ఏకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సంపద్యతే తదా ||

తాత్పర్యము : బుద్ధిమంతుడైనవాడు భిన్నదేహముల కారణంగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ వి ధంగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.

భాష్యము : వేర్వేరు శరీరములు ఆత్మకు చెందినవి కావని, ఆత్మ యొక్క కోరికల వలన వేర్వేరు శరీరాలలో కొనసాగవలసి వస్తుందని చూడగలిగినవారు వాస్తవాన్ని చూస్తున్నట్లు లెక్క. భౌతిక భావనలో ఇతడు దేవత, అతడు మానవుడు, లేదా కుక్క, పిల్లి ఇలా వేర్వేరు శరీరాలనే మనము చూస్తూ ఉంటాము. కానీ అది భౌతికమైన
దృష్టి. శరీరములు నశించినప్పటికీ ఆత్మ ఒక్కటే. ఈ భౌతిక సృష్టిలో ఆత్మ వేరు వేరు శరీరాలను బట్టి వేర్వేరుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిని అర్థము చేసుకుని కృష్ణ చైతన్యవంతుడవుతాడో, విశుద్ధ చైతన్యములో మానవుడు, జంతువు, పెద్ద, చిన్న అను తారతమ్యములను వీడి ఆధ్యాత్మిక దృష్టిని కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడో రాబోవు శ్లోకములో వివరించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement