Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 31
31.
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోస్తుతే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌ ||

తాత్పర్యము : ఓ దేవవర! భయంకర రూపముతో నున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయుము. నీకు వందనములనర్పించెదను. నాయెడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.

భాష్యము : అర్జునుడు కృష్ణుడు తన స్నేహితుడని, దేవాదిదేవుడని ఎరిగి యున్ననూ, విశ్వరూపము నందు చూపిన వేర్వేరు రూపములను చూసి కలవరపడెను. అందువలన ఇటువంటి ఘోర రూపము యొక్క ఉద్దేశ్యమేమని, తన సంకల్పమేమని ప్రశ్నించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement