Friday, May 3, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

ఆధ్యాయం 6, శ్లోకం 41

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్‌
ఉషిత్వా శాశ్వతీ: సమా: |
శుచీనాం శ్రీమతాం గేహే
యోగ భ్రష్టో భిజాయతే ||

తాత్పర్యము : యోగభ్రష్టుడైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములననుభవించిన తరువాత పవిత్ర కుటుంబమున గాని లేదా ధనికుల గృహమున గాని జన్మించును.

భాష్యము : శ్రీకృష్ణుడు మరిన్ని వివరాలను తెలియజేస్తున్నాడు. పరిపక్వతను సాధించమని యోగి ఉన్నత లోకాలైన స్వర్గాలకు వెళ్ళి భోగభాగ్యాలను అనుబవించి తిరిగి గొప్ప బ్రాహ్మణ, వైష్ణవ లేదా రాజ కుటుంబాలలో గాని, ధనికుల కుటుంబాలలో గాని పుట్టే అవకాశాన్ని పొందుతాడు. యోగ పద్ధతి యొక్క పక్వ ఫలము కృష్ణ చైతన్యమును అలవరచుకొనుట. కాబట్టి అట్టి ఉన్నత జన్మ లభించినప్పుడు దానిని పూర్తిగా సద్వినియోగపరచుకొనవలసి ఉన్నది. ఆ జన్మలో జీవిత లక్ష్యాన్ని సాధించవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement