Thursday, April 25, 2024

మాదాపూర్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో డ్రైవింగ్ ?

హైదరాబాద్ సిటీలో ఇవ్వాల (శ‌నివారం) ఉద‌యం కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో తెల్లవారు జామున డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడ‌పడంతో అదుపుతప్పింది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారులు.. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వాహనాన్ని కూడా తరలించారు. వాహనం నడిపిన వ్య‌క్తి బాగా మద్యం తాగడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement