Wednesday, May 15, 2024

సంతాన ప్రదాయిని గరుడ పంచమి

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో ”గరుడ పంచమి” ఒకటి. గరు త్మంతుడు సూర్యరథ సారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరుపర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసు రుతో ఎగర గొట్ట గల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి ‘సుపర్ణుడు’ అనే పేరు కూడా ఉన్నది. గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సము ద్ర మథనంలో”ఉచ్పైశ్రవం” అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు.
ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో, ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చూశారు. కద్రువ, వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, విన త గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు, గుఱ్ఱపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినత కు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్దితో తన సంతానమైన నాగుల ను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోప గించిన కద్రువ ”జనమేజయుని సర్పయాగంలో నశించాలని” శపించింది. ఒక్క కర్కోట కుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకు రాగానే ”అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను. కాని నీవు రెండవ గుడ్డు ను తొందరపడి పగుల గొట్టవద్ద”ని చెప్పి, సూర్యభగవానుడి రథసారధిగా వెళ్ళిపోయాడు.
కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినత క్షేమం కోసం, తల్లి ఋ ణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తాన ని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయ లుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి. అమృతాన్ని కాపాడమని హచ్చరికలు జారీ చేశాడు. దేవతాశ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధంచేశారు. పెట్రేగిపో యిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి, తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు, రుద్రులు, అశ్వనీదేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరినీ ఎదుర్కొ ని ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరు త్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా, విష్ణువు అతడిని సమీపించి ”నీ విజయ సాధన కుమెచ్చాను, ఏమికావాలో కోరుకో” అన్నాడు. ”నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి” అం టాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా, జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు.
ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ”అమృ తం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో…! అమృతం సేవిస్తే వారు జయించలేనివారవుతారు. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా… బహుమతిగా ఇస్తా” అని అన్నాడు. ”నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగక ముం దే నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి” అని అన్నాడు.
అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలు దేరి పాములకు ఆ పాత్రనిచ్చి… ”చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి అమరు లవ్వండి” అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు మనోవేగాలతో ఉడా యించాడు. నియమ నిష్టల పేరుతో… పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టడం, ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడపంచమి.
గరుడ పంచమి రోజున మహళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటిఆకును పరచి బియ్యం పోసి, వారి శక్తిమేర బంగారు, వెండి నాగపడగను ప్రతిష్టించి, పూజచేసి, పాయసం నైవేద్యం పెడతారు. మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని నిర్వహస్తారు. నూతన దంపతులు తమ వైవాహక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలి గా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడ పంచమి” పూజచేస్తారని ప్రాశస్త్యం.
సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కం ద పురాణంలో వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే… తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూ జలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శుక్ల పంచ మి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.
నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున

‘విషాణితస్య నశ్యంతి నటాంహంసంతి పన్నగా:
న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్‌’
ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విష బాధలుండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజూ, నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. కాశీలో శేషుని అవతారంగా భావిం చే పతంజలిని ఈ రోజే పూజిస్తారు. మానవుని మానసిక శక్తికి పాము చిహ్నం. మానసిక శక్తికి వేదాంత పరిభాషలో కుండలినీ శక్తి అని పేరు. కుండలినిని సర్పం టైన్‌గా పిలుస్తారు. మూ లాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముక మధ్య నుండి సర్పాకారముగ కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడిని లేవజూపడమే నాగపూజ ప్రధానోద్దేశమని విజ్ఞుల భావన.
గురుడునికి వైనతేయుడని మరోపేరు ఉంది. గోదావరి ఏడుపాయల్లో ఒకదానికి వైనతే య అని పేరు. అది వసిష్ఠ గోదావరి నుండి గన్నవరం అనే ఊరు వద్ద నుండి విడిపోతుంది. ఆ గన్నవరం వద్ద గరుడేశ్వర స్వామికి ఒక ఆలయం ఉంది. గన్నవరాన గరుడేశ్వర స్వామిని గరుడుడు ప్రతిష్టించాడని ప్రతీతి ఉంది. వైనతేయ పాయను తీసుకువెళ్లింది వైనతేయుడైన గరుడుడు లేక వైనతేయ ఋషి అంటారు.
నాగపంచమి తిథికే గరుడ పంచమి అనే పేరు కూడ ప్రవర్తితం కావడానికి ఏమిటి కార ణం? ఈ జిజ్ఞాసకు సమాధానం బ్రహ్మాండ పురాణంలో ఉంది. శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుడు అమృతాపహారణం చేశాడు. అందుచేత దీనికి ‘గరుడపంచమి’ అనే పేరు వచ్చింది.
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి కూడా పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాలపాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. ఇలా మన పూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడపంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.
దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే, ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉంటాడు. దాని అంతరార్ధం”స్వామీ! నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే” అని.
సర్వశక్తి సంపన్నుడు అయి ఉండీ, సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనాలను తెంపి, మహావిష్ణువుకు వాహనంగా వినుతికెక్కిన వైనతేయుడు ప్రాత:కాల స్మరణీయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement