Monday, May 13, 2024

శ్రీ‌శైలంలో వైభ‌వంగా ద‌స‌రా మ‌హోత్స‌వాలు..

నంద్యాల : దసరా మ‌హోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం చేయనున్నారు. స్వామి అమ్మవార్లకు మయూర వాహనసేవ నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహా న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు చేపట్టనున్నారు. వీటితోపాటు రుద్రహోమం, చండీహోమం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇక ఉత్సవాలలో భాగంగా చతుర్వేదపారాయణలు, రుద్ర పారాయణ, చండీ పారాయణ, జపానుష్ఠానాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement