Saturday, May 4, 2024

దివ్య ముహూర్తం

సృష్టి పరిణామ క్రమంలో మానవుడు మధ్యంతర జీవి మాత్రమే. మాన వుడే చివరివాడు కాదు. మానవ స్వభా వంలో కొన్ని దివ్య గుణాలున్నాయి. అలాగే కొన్ని జంతుగుణాలూ వున్నాయి. సందర్భాన్ని బట్టి ఏది బలంగా వుంటే అది ముందుకు వస్తుం ది. అందుకే మానవుడు అసంపూర్ణుడు. ఈ అసం పూర్ణ మానవునితో సృష్టి సంతృప్తిచెందదు. ఈ మానవుడిలో ఉన్న జంతు స్వభావం పూర్తిగా పరిహరించబడాలి. ఈ మానవుడు దివ్య మాన వుడు కావాలి. అయితే ఈ మానవుడు తనను తాను అధిగమించితే తప్ప ఉన్నతుడు కాలేడు. అందుకు దివ్యశక్తి అవతరించి అతనిని చేయి పట్టుకొని ముందుకు నడిపించాలి. అలా ఓ దివ్య శక్తి అవతరించింది. దానినే శ్రీ అరవిందులు అతి మానస శక్తి అన్నారు. అది తన పనిని తాను చేస్తు న్నది. ఫలితంగా మానవుడిలో మార్పు వస్తు న్నది.
ఓ యాభై సంవత్సరాల కాలంనాటి పిల్లలకు ఇప్పటి పిల్లలకు వున్న వ్యత్యాసాన్ని గమనించితే అది స్పష్టంగా తెలుస్తుంది. గతం కాలగర్భంలో కలిసిపోతున్నది. భవిష్యత్తు శరవేగంతో ముందు కు దూసుకువస్తున్నది. ఇది సంధియుగం. అంటే బ్రాహ్మీ ముహూర్తం. దైవ ముహూర్తం. దానిని గురించి చెప్తూ శ్రీ అరవిందులిలా అంటారు.

ఇది దైవ ముహూర్తం

”కొన్ని సమయాలలో దివ్యశక్తి మానవుల మధ్య సంచరిస్తుంది. మన ఆత్మల గంగాలహరి ప్రభుని విశ్వాస ప్రసరణంతో దోలలాగుతుంది. మరికొన్ని వేళల్లో ఆ శక్తి దూరంగా తొలగుతుం ది. అప్పుడు మానవులు తమ అహంకారం మీద ఆధారపడి బలమునో, బలహీనతనో ప్రదర్శించు కోవలసి వస్తుంది. దివ్యశక్తి ఆవిర్భవించిన సంద ర్భాలలో స్వల్ప ప్రయత్నాలు కూడా భవిష్య త్తును మార్చగల మహా ఫలితాలను ప్రసా దించగలవు. దైవశక్తి దూరమైన సన్నివేశాలలో స్వల్ప ఫలితాలు సాధించటం కోసం అనల్పమైన ప్రయత్నం అవసరమౌతుంది. ఇటువంటి మహా ప్రయత్నాల ద్వారా హోమ వేదికల నుంచి స్వర్గా నికి ఎగసిన త్యాగధూమం ద్వారా ఈశ్వరాను గ్రహ దృష్టి పుష్కలంగా భూమిమీద వరించ గలదన్న మాట సత్యం.
దివ్య ముహూర్తం ఆసన్నమై నప్పుడు నిద్రావివశమై, సంసిద్ధంగా లేక, ఆహ్వాన దీపికలు వెలిగించ కుండా పిలుపు వినలేని స్థితిలో వున్న మానవుడు కాని, జాతి కాని నిజంగా అదృష్ట హీనులు. శక్తి ఉండి కూడా దుర్వినియోగం చేసేవారు, మేల్కొని కూడా అవకాశాన్ని జారవిడిచేవారు అంతకంటే మూడు రెట్లు దురదృ ష్టవంతులు వారికి తీరని నష్టమూ ఘోర వినాశనమూ దాపురిస్తాయి.
దివ్య ముహూర్తం ఆసన్నమైన ప్పుడు ఆత్మవంచనా, కపట నాటక మూ గర్వపూరితమైన ఆత్మస్తుతీ విస ర్జించాలి. ఆత్మను పవిత్రం చేసుకోవా లి. సూటిగా అంతరంగంలోకి చూసి పిలుపును వినగలగాలి. నిజాయితీ లేకపోవటం గొప్ప లోపం. భగవం తుని కన్ను కప్పగలిగినామని మనం సంతో షపడినా, అదే చిత్తశుద్ధి లోపమై కవచంలో కంత అవుతుంది. చిత్తశుద్ధి లేనివారు తాత్కాలిక విజ యం పొందవచ్చును. విజయోత్సాహంతో విర్ర వీగే వేళ దెబ్బ పడి తీరుతుంది. అప్పుడు నేల కూలక తప్పదు. పవిత్రతను సాధించిన పిమ్మట అన్ని భయాలూ వదిలివేయండి.
దివ్యముహూర్తం ప్రళయ భీకరంగా ప్రభంజ నాలతో అగ్నిజ్వాలలతో రావచ్చును. ఈశ్వరుని ఆగ్రహం ద్రాక్షాదళన యంత్రమై అణచివేయ వచ్చును. కానీ తన లక్ష్యం స్వచ్ఛమైనదనే విశ్వా సంతో గట్టిగా నిలబడి అన్నిటినీ భరించగలవాడు తప్పక జయిస్తాడు. అటువంటివాడు పడి పోయినా మళ్ళీ లేచి నిలుస్తాడు. గాలి రెక్కల మీద తేలిపోయినట్లు అనుభూతి చెందినా, తిరిగి మళ్ళీ వాస్తవంలోకి వస్తాడు. మీ యోగక్షేమాల కోసం, భద్రత కోసం ఎప్పుడూ వెనుదీయ కూడదు. అలాంటి సందర్భాలే ఎదురు చూడని పరిణామాలకు అదును.” అని అందరూ తెలుసు కుని జాగరూకతతో మెలగాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement