Tuesday, April 30, 2024

శ్రీరాముని తీర్పులో ధర్మ నిరతి!

శ్రీరాముడు రావణ సంహారం తరువాత సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన తరువాత, ఒకరోజు ఒక గ్రద్ద, ఒక గుడ్ల గూబ రాజ దర్బార్‌ వద్దకు వచ్చాయి. వృక్షసంపద చేత ప్రకాశిస్తూ, అక్కడక్కడ నదీ ప్రవాహాల వ్యాప్తమైన రామరాజ్యంలోని ఒక వనంలో కోకిల ధ్వనులతో పక్షుల కిలకిలా రావాలు, నానా విధాలైన అడవి జంతువులతో కళకళలాడుతూ ఉన్న, ఆ ప్రదేశంలో ఒక చెట్టుపై ఒక గ్రద్ద, ఒక గుడ్ల గూబ వేరుగా ఎవరింట్లో వారు నివసిస్తున్నారు. పాపపు బుద్ధి గల గ్రద్ద గుడ్లగూబ ఇంటికి వెళ్ళి, ”ఇది నా ఇల్లు, నీవు ఎన్నాళ్ళుంటావు? నీవు వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపో!” అని కల #హం ప్రారంభించింది. అపుడు గుడ్లగూబ సాధు సత్త్వంతో ”ఇది నా ఇల్లు. ఎప్పటి నుంచో ఉంటుంటే ఇప్పుడు వచ్చి తగుదునమ్మా అంటూ నాఇల్లు అనటం ఏం బాగుంది?” అం ది.
ఇద్దరి మధ్య కొంత రగడ జరిగిన తదుపరి, గుడ్లగూబ ”పద్మనేత్రుడైన రాముడు ఈ సమస్త లోకానికి మహారాజు. ఆ ఇల్లు ఎవరిదో తేల్చుకోవడానికి రాజైన శ్రీరాముడునే ఆశ్ర యిద్దాం!” అంది. దానికి గ్రద్ధ కూడా అంగీకారం తెలిపిన తర్వాత, ఇద్దరు రాజదర్బార్‌కు విచ్చేసారు. అపుడు భటులు గ్రద్దను, గుడ్లగూబను రాముని ముందుకు తీసుకొచ్చారు. ఆ ఇరువురు శ్రీరాముడుని చూసి పాదాభివందనం చేసి ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు. అపుడు రాముడు ”మీరు వచ్చిన పని ఏమిటి? మీకు ఏమైనా అన్యాయం జరిగిందా? వివరించండి” అనగానే, గ్రద్ద ”మహారాజా! గొప్ప కాంతికలవాడా! నీవు బృ#హస్పతి కంటె, శుక్రాచార్యుని కంటె, గొప్పవాడవు. ప్రాణులలో తారతమ్యాలు తెలిసిన వాడవు. గౌరవంలో నీవు #హమవం తుడవు. గాంభీర్యంలో సముద్రుడంతటి వాడవు. రామా! నీవు పూజ్యుడవు. ధర్మాత్ముడవు. కీర్తి కలవాడవు. నిన్ను జయింప శక్యము కాని వాడవు. సకల శాస్త్రాలు తెలిసినవాడవు. మహా రాజా! నేను పూర్వం నిర్మించుకొన్న గృ#హములో కొన్నాళ్ళు తలదాచుకోవడానికి ఈ ఉల్లూ కము (గుడ్లగూబ)కు ఇచ్చాను. ఇప్పుడది ”ఈ ఇల్లు నాది” అంటూ తన బా#హుబలంచేత ఆక్ర మించి ఉంది. నేను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపో! అంటే ఇది నాదే అంటూ వాదులాడుతోంది. మహారాజా! నా ఇల్లు నాకు ఇప్పించమని వేడుకొంటున్నాను” అని చెప్పింది.
గుడ్లగూబ బదులిస్తూ ”మహారాజా! నీవు రెండవ నారాయణుడవు. సకల దేవతా స్వరూపుడవు. ధర్మమే ప్రధానంగా గల నీవు సౌమ్యుడవు. బాగా పరిశీలించి, న్యాయం చెప్పండి రాజా! నీవు క్రోధము నందు, దండము నందు, దానము నందు, పాపభయాలను పోగొట్టి, ఇంద్రుడు వలె దాతవు. #హర్తవు. రక్షకుడవు. రామా! నీ దృష్టి శత్రువు యందు, మిత్రు ని యందు సమముగా ఉంటుంది. వ్యవహారము లందు విద్యానుసారంగా ధర్మం చేత శాసనము చేయించు వాడవు. నాథుడు లేని నావంటి దుర్భలుర కు రాజే బలం. అట్టి నీవు కళ్ళులేని వాడికి కన్ను, గతి లేని వారికి గతివి. రాజా! తరచూ ఈ గ్రద్ద నా ఇంటికి వచ్చి బాధప డుతోంది. నరశ్రేష్ఠుడైన రాజు, నీవే మానవులకు శిక్షకుడవు కదా. గ్రద్ద తరచూ మా ఇంటికి రాకుండా నివారించి, నా ఇల్లు నాకు అప్పగించండి మహాప్రభో!” అని వేడుకొంది.
ఇరువురి ప్రతివాదనలు విన్న రాముడు, తన మంత్రులు దృష్టి, జయంతుడు, విజయు డు, సిద్ధార్థుడు, రాష్ట్ర వర్దనుడు, అశోకుడు, ధర్మపాలుడు, గొప్ప బుద్ధి కల సుమంతుడులను పిలిపించాడు. వీరు శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజుకు కూడా మంత్రులుగా పనిచేసిన వారే. ఈ మంత్రులు మహాత్ములు. సకల శాస్త్ర విశారధులు. నీతిమంతులు. రాముడు పిలవ గానే వారు అందరూ దర్బార్‌లోకి వచ్చి రాముడికి నమస్కరించగా, శ్రీరాముడు వారందరికీ గ్రద్ద గుడ్లగూబ తగవు వివరించాడు. తరువాత రాముడు మాట్లాడుతూ ”ఓ! గధమా! (గ్రద్దా) నీవు ఈ గృహాన్ని నిర్మించుకొని ఎన్నాళ్ళ య్యింది? యదార్థముగా చెప్పు” అనగానే, గ్రద్ద బదులిస్తూ రామా! ఈ భూమి ఉద్భవించిన తదుపరి, మానవుల చేత కప్పబడిందో ఆనా టి నుండి నా గృ#హమే.” అనగానే, గుడ్లగూబ రామునితో ”రాజా! ఈ భూమి వృక్షాలతో ఎప్ప టి నుండి ప్రకాశిస్తోందో అప్పుడే నేను నిర్మించుకొన్నాను” అని చెప్పగా, రాముడు అక్కడ సభలోని వారందరినీ ఉద్దేశించి-
”న సా సభా యత్ర న సన్తివృద్ధా
వృద్ధా నతే యేన వదన్తి ధర్మమే!”
అంటే వృద్ధులు లేని సభ సభే కాదు. ధర్మము చెప్పనివారు వృద్ధులు కాదు కదా. సత్య ము లేనిదే ధర్మం కాదు. సత్యం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించే ఉంటుంది. కపటముతో కూడిన సత్యం సత్యమే కాదు. సభ్యులు తెలిసి ఉండీ కూడా మాట్లాడకుండా చూస్తుంటారు. చెప్పవలసిన సత్యాన్ని చెప్పరు. అటువంటి వారందరు అసత్యం పలుకు వారే. కామము, క్రోధము, భయం వల్లగాని ఎవరు తెలిసినా తెలియనట్లు ఉండేవారు, వెయ్యి పాశములను తనకు తాను తగిలించుకొన్నట్లే! అప్పుడు మంత్రులు ”ఓ! రామా! ఉల్లూకము (గుడ్లగూబ) మంచిదనిపిస్తోంది. అది పలికిన మాటల్లో సత్యం గోచరిస్తోంది. రాజా! ప్రజలకు రాజే మూలం. రాజ ధర్మం చాలా ప్రాచీనమైనది. మీరే నిర్ణయించండి.” అన్నారు.
శ్రీ రాముడు ”పురాణాల యందు ఇంద్ర, సూర్య, నక్షత్ర, పర్వత, మహారణ్యాలతో కూ డిన ఆకాశం, స్థావర జంగములతో కూడిన ఈ మూడు లోకాలు కూడా సముద్రంతో నిండి పోయి, ప్రపంచమంతా ఒక్కటిగానే అయిపోతుంది. తరువాత సృష్టి క్రమంలో బ్ర#హ్మ దేవు డు వాయువును, పర్వతాలను, వృక్షాలను, సర్పాలను, జలరాశిని, అండజాలను సృష్టిం చారు. భూమి వీటి అన్నిటితో నిండిపోయింది. అందుకే భూమిని ”మేదిని” అంటారు. ఈ గుడ్లగూబ చెప్పిన దాని ప్రకారం సృష్టి నుంచి వృక్ష సంపద ఉంది. మానవ సృష్టికి ముందే వృక్ష సంపద ప్రారంభమయ్యింది. చెట్లు లేనిదే గూళ్ళు కట్టుకోలేవు. ఈ గ్రద్ద మాట అసత్యం. దండమునకు అర్హురాలు.” అన్నాడు.
ఆ వెంటనే ఆకాశం నుండి ”రాజా! తపోబలంతో కాల గౌతముడనే విప్రుని చేత శపించబ డిన రాజు బ్ర#హ్మదత్తుడు. ఇతడు సత్యవ్రతుడు. పరిశుద్ధుడు. శాపం వల్ల గ్రద్దగా మారిపో యాడు. నీ అనుగ్ర#హం వల్ల స్పృశిస్తే మామూలు రూపంలోకి వస్తాడు.” అని వినిపించింది. ఆ మాటకు రాముడు ఆ గ్రద్దను స్పృశించాడు. వెంటనే బ్ర#హ్మదత్తుడుగా మారి, ”రామా! నీ అనుగ్ర#హం వలన ఘోరమైన నరకం నుండి తెప్పించుకొన్నాను.” అని నమస్కరించి వెళ్ళి పోయాడు. రాముని తీర్పుతో న్యాయం జరిగిందని పండితులు, మంత్రులు చెప్పుకున్నారు.
(ఉత్తర
రామాయణం నుంచి)

Advertisement

తాజా వార్తలు

Advertisement