Friday, December 1, 2023

సూర్యారాధనకు ఉత్తవెూత్తమం భాను సప్తమి!

”సప్తాశ్వ రథమారూఢం,
ప్రచండం, కశ్యపాత్మజమ్‌,
శ్వేత పద్మధరం, దేవం, తం
సూర్యం ప్రణమామ్య#హం”

మన సంస్కృతిలో సూర్యారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. సప్తధాతు నిర్మితమైన మన దేహమనే చిత్ర రథాన్ని అధిరోహంచి ఆత్మస్వరూపంగా మనలోను, సప్తాశ్వ రథాన్నె క్కి, విశ్వానికంతటికీ కర్మసాక్షిగా నిలిచిన సూర్యస్వరూపంగా అంతరిక్షంలోనూ..
”అంతర్బహశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత:” అనే వేద వాక్యాన్ని నిజం చేస్తూ ఆ పరమాత్మ నిలిచి ఉన్నాడు.
సూర్యునికి ‘సప్త’ అంటే ఏడు అనే సంఖ్య ఎంతో ప్రత్యేకమైనది. ఆయన ‘సప్తాశ్వ రథారూఢుడు’. అశ్వం అంటే (అశూవ్యాప్తా) శీఘ్రంగా వ్యాపించేది, ప్రసరించేది అని అర్థం. సూర్యకిరణాలు, గుర్రాలు… రెండింటినీ అశ్వాలు అని వ్యవహరిస్తారు. సప్తాశ్వుడు అంటే (సప్త అశ్వా: యస్య స:) ఏడు గుర్రాలు కలవాడని ఒక అర్థం, (సప్త నామక అశ్వో యాస్యేతి స:) ”సప్త” అనే పేరున్న ఒక గుర్రాన్ని కలిగినవాడు అని మరొక అర్థం చెప్పబడినాయి. ఒకటే సూర్యకాంతి సప్త వర్ణాలుగా భాసిస్తుందనేది మనకందరికీ తెలిసినదే. ఆవిధముగా ఏడు వర్ణా లు లేక ఒకే వర్ణం సూర్యునికి వా#హనాలుగా చెప్పబడ్డాయి. ”అహర్పతి” అంటే పగటిని ఏర్ప రచేవాడు అయిన సూర్యునికి అలాంటి ఏడు పగళ్ళతో కూడిన రోజులతో ఏర్పడిన వారం లోని ఏడు రోజులూ అశ్వాలుగా అమరినాయని పురాణ వచనం. ”త్రయీమూర్తి” అంటే ఋగ్యజుసామ పారగుడైన సూర్యునికి ఆ వేదాలలోని ముఖ్య ఛందస్సులైన గాయత్రి, త్రిష్టుప్‌ అనుష్టుప్‌, జగతి, ఉష్ణిక్‌, పంక్తి, బృ#హతి.. అనేవి అశ్వాలైనాయని వేదవాక్కు. సంగీతంలోని సప్తస్వరాలే ఆయన అశ్వాలని మరొక కథనం.
ఏదిఏమైనా తిథులలో సప్తమి, వారాలలో భానువారం సూర్యునికి ప్రీతికరమైనవిగా చెప్పబడ్డాయి. ఆదివారం సప్తమీ తిథితో కూడి ఉంటే ఆ రోజును ”భాను సప్తమి”గా, సూర్యారాధనకు ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఒకవేళ ఆ రోజున శ్రవణ నక్షత్రం కూడా ఉంటే దానిని ‘శ్రవణ రుద్ర సప్తమి’గా.. అది మరింత పవిత్రమైన రోజుగా విశ్వసిస్తారు. అలాం టి శ్రవణరుద్ర భాను సప్తమి హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో (ఈ రోజు) సంభవించడం మరింత విశిష్టమైన రోజుగా, సూర్యారాధనకు ఉత్తమోత్తమమై నదిగా భావించబడుతూంది.

- Advertisement -
   

”న కార్తీక సమో మాసో,
న కృతేన సమం యుగం
న వేద సదృశం శాస్త్రం
న తీర్థం గంగాయా సమం”

అంటూ కార్తీకమాసానికి సాటివచ్చే నెల, కృతయుగానికి సమానమైన యుగం, వేదానికి తుల్యమైన శాస్త్రం, గంగతో పోల్చదగిన పుణ్యతీర్థం ఉండవని కార్తీక పురాణం నొక్కి వక్కాణించింది. అలాంటి కార్తీకమాసంలో శ్రవణ నక్షత్ర యుక్తమైన భాను సప్తమి ఈ రోజు (అంటే 19.11.2023). ఇది చాలా అరుదైన, విశిష్టమైన పర్వదినం. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని పూజించడానికి ఎప్పుడోకానీ లభించని అత్యంత అరుదైన పవిత్ర ము#హూర్తమీ రోజు.
కశ్యప ప్రజాపతికి, అదితికి జన్మించిన సూర్యుడు తన సోదరులైన దేవకోటికి అంతటికీ ప్రతీకగా, ప్రపంచానికంతటికీ ప్రాణశక్తిని, వెలుగును, వెచ్చదనాన్ని, చైతన్యా న్ని సమానంగా పంచుతూ, ‘సర్వసాక్షి’, ‘లోకబాంధవుడు’ అని పిలువబడుతూ, పూ జింపబడుతున్నాడు. పైకి అగ్నిగోళంలా కనబడినా మిక్కిలి దయార్ద్ర #హృదయుడు. ప్రాణులకు హానికరములైన సూక్ష్మజీవులను తన కిరణాలచేత నశింపజేసి ప్రాణులను రక్షిస్తా డు. విశ్వనాథుడైన పరమేశ్వరునికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు నేత్రాలున్నా యని వేదం వర్ణించింది. విశ్వనాథునికే కాదు, విశ్వములోని ఏ ప్రాణికైనా ప్రపంచంలోని వస్తువుల ఉనికి తెలిసేది ఈ మూడింటి నుండి వచ్చే వెలుగుల ద్వారానే కదా!
వాస్తవంగా చంద్రుడు, అగ్ని కూడా సూర్యుని ప్రకాశం వల్లనే మనకు గోచర మవుతు న్నారు. కనుక మనం చూడగలిగే శక్తికి మూల వనరు సూర్యుడే. అందుకే ఆయనను జగచ్చ క్షువు (లోకులందరికీ కన్నుగా అమరినవాడు) అని అంటారు. అతని వల్లనే మేఘాలు ఏర్పడి, వర్షాలు కురిసి, పంటలు పండి, మన కడుపులు నిండుతున్నాయి.
సూర్యారాధన మహత్తరమైన ఫలితాలనిస్తుందనేది అక్షరసత్యం. హనుమకు సకల విద్యలనూ ప్రసాదించిన గురూత్తముడు, యాజ్ఞవల్క్యునికి వేద విజ్ఞానాన్ని బోధించిన వాడూ సూర్యుడే. కనుక సూర్యుని ఉపాసన మనలను విద్యావంతులను చేస్తుందనడంలో సందేహం లేదు. వైజ్ఞానికంగా కూడా మన మేధకు చురుకుదనం సూర్యుని కిరణాలలో నుండి లభించే ‘డి’ విటమిన్‌ వల్లనే కలుగుతుందని నిరూపించబడింది. పాండవులకు అరణ్య వాస సమయంలో అక్షయపాత్ర లభించింది కూడా సూర్యారాధన వలననే. కనుక సూర్యుని ఉపాసించిన వారికి తాము తిని, అతిథులకు పెట్టగలిగినంత ఆహారం కొరత లేకుండా నిత్య మూ లభిస్తుంది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు సంక్రమించిన కుష్టు వ్యాధిని సూర్యారాధన వలన నయం చేసుకొన్నాడనీ, సూర్య శతకాన్ని రచించి, మయూరుడనే సంస్కృత కవి తన అనారోగ్యాన్ని బాగు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవం తుడయ్యాడనీ చెప్పబ డే గాథలు సూర్యుని పూజించిన వారికి అనారోగ్య పీడలుండవనడానికి నిదర్శనాలని పెద్ద లంటారు. ”ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌” అని కదా శాస్త్ర వచనం. ఇక సూర్యుని తన తపస్సు చేత మెప్పించి సత్రాజిత్తు శమంతకమణిని పొందిన కథ భాగవతములో ఉంది. అంటే సూర్యోపాసన అంతులేని ఐశ్వర్యాలనిస్తుందని అర్థం. శ్రీరాముడు కూడా అగస్త్యుని ద్వారా ”ఆదిత్య హృదయం” ఉపదేశం పొంది రావణుని అవలీలగా గెలువగలిగాడు. ఇది సూర్యా రాధన వలన శత్రు నిర్మూలనం, విజయం, రాజ్యాధిపత్యం లభిస్తుందనడానికి నిదర్శనం.
ఇంతటి మహత్తర ఫలితాలనందించే సూర్యారాధన కోసం మనమీ భాను సప్తమి రోజున సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, పరిసరాలను, ఇంటిని శుభ్రపరచుకొని, నూనె పెట్టుకో కుండా శిర స్నానం చేయాలి. దీపాలు వెలిగించి, సూర్యునికి షోడశోపచార పూజచేసి, సూర్య నమస్కారాలతో ఆయనకు ప్రీతి కలిగించాలి. సూర్యునికి అర్ఘ్యం వద లాలి. గోధుమనూక, బెల్లం, పాలు కలిపి మెత్తగా వండిన పాయసాన్ని ఆయనకు నివేదించాలి. పూజా సమయంలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలను, ఇతర దేవతలకు అర్పించినట్లుగా, సూర్యునికి నైవేద్యం చేయరాదు. చక్కగా కొబ్బరిని కోరి (తురిమి) దానికి పంచదార లేక బెల్లం చేర్చిన తర్వాతనే ఆయనకు నివేదించాలి. కేవలము సాక్షిగా ఉన్నందుకుగాను సూర్యునికి అమృతోత్పాదన సమయంలోనూ, దక్షయజ్ఞ ధ్వంస సందర్భంలోనూ నిష్కారణంగా కష్టాలు కలిగాయి. అమృతాన్ని దేవతల పంక్తిలో కూర్చొని రాహుకేతువులు త్రాగబోతుండ గా, మోహనీ రూపంలో ఉన్న శ్రీహరికి సైగచేసి చెప్పినందుకుగాను గ్రహణ బాధ, దక్ష యజ్ఞ సమయంలో ఇతర దేవతలతో బాటు కూర్చొన్నందుకు వీరభద్రుని చేత దంతభంగము సూర్యునికి కలిగాయి. అందుకే సూర్యునికి మెత్తటి పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి.
ఈ రోజు (19.11.2023) స్త్రీ సంగమము, తైలాభ్యంగనము, మద్యపానము, మాంస భక్షణం నిషేధించబడినాయి. ఈ నియమాలు పాటించిన వారు వ్యాధుల, దు:ఖాల, దారిద్య్రాల బారినపడకుండా పూర్ణాయురారోగ్యాలతో జీవించి, తర్వాత సూర్యమండలాన్ని చేరుకుంటారని ఆదిత్య హృదయం చెబుతున్నది.
పరమ దయాళుడైన సూర్యుడు పొరబాటుగా రాక్షసులకు కూడా ఎక్కడ వరమిస్తాడో అనే సందేహంతో యమాగ్ని రుద్రులు- మాకర, పింగళ, దండులు- అనే పేర్లతో పారిపార్శ్వకులై సూర్యునికి సమీపంలో, మూడు వైపులా కాపు కాచుకొని ఉంటారని ఆదిత్యపురాణం చెబుతోంది.
మనం చేసే ఆదిత్య హృదయ పారాయణతో, సూర్య నమస్కారాలతో, అర్ఘ్య ప్రదానంతో తృప్తి చెంది మనకు అనంత వైభవాన్ని ప్రసాదించే ఆ దివాకరునికి భక్తితో, త్రికరణశుద్ధితో, ఈ రోజు పూజచేసి తరించుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement