Monday, April 29, 2024

IND vs AUS | టెన్షన్​.. టెన్షన్​! ఆసీస్ టార్గెట్ 241

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తడబడుతోంది. యంగ్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కాగా రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లీ 54, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో 50 ఓవర్లలో 240 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది టీమిండియా…

7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ పట్టిన సూపర్ క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు.

రోహిత్​ రికార్డులు..

- Advertisement -

ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 పరుగులు చేయగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని అధిగమించేశాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. 63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 9వ సారి 50+ స్కోరు చేసి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

వరల్డ్​ కప్​లో కోహ్లీ 765 పరుగులతో రికార్డు​

ఈ వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హాఫ్ సెంచరీ తర్వాత ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ల పైకి ఆడుకుని అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement