Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 37

యథైధాంసి సమిద్ధో గ్ని:
భస్మసాత్కురుతేర్జున |
జ్ఞానాగ్ని: సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా ||

తాత్పర్యము : ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలములనన్నింటిని బూడిదగా చేసివేయును.

భాష్యము : ఆత్మ, పరమాత్మల నడుమ గల సంబంధమును తెలియజేయు జ్ఞానమును ఇక్కడ అగ్నితో పోల్చారు. ఆ అగ్ని మన పాప కార్యములు, పుణ్యకార్యములు వలన వస్తున్న అన్ని ఫలితాలను భస్మం చేస్తుంది. కర్మ ఫలితాలు నాలుగు దశలలో పరిపక్వత చెందుతూ ఉంటాయి. కొన్ని మనము ఇప్పటికే అనుభవిస్తున్నవైతే, మరికొన్ని త్వరలో రాబోవుచున్నవి. ఇక మిగిలినవి నిగూఢముగా ఉన్నవి, మరికొన్ని దూరపు భవిష్యత్తులో వచ్చేవి. కాని జీవి యొక్క నిజస్థితిని గురించిన జ్ఞానము వీటన్నింటినీ భస్మము చేసి వేస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement