Monday, May 6, 2024

శక్తి స్వరూపిణి బతుకమ్మ!

ప్రతి పండుగ పరంపరానుగతంగా ప్రత్యేక శైలిలో, విశిష్ట పద్ధతిలో జరుపుకునే ధార్మిక కార్యాచరణాసక్తుల నిలయం తెలంగాణ. ఈనాట అపురూప సోదరీమణులైన జ్యేష్టాదేవి, లక్ష్మీదేవిలను కొలుస్తూ, బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తిశ్రద్ధలతో, పిల్లాపాపలతో కలిసి మహిళలు జంట పండుగలుగా పక్షం రోజుల తేడాతో నిర్వహించడం అనాదిగా ఆచరిస్తున్న సనాతన సంప్రదాయం.

బతుకునిచ్చే తల్లిని లక్ష్మీ- గౌరీదేవిల ను అభేదిస్తూ, శక్తి రూపంగా ఆటపాటల ద్వారా పూజిస్తూ, ఉన్నంతలో రకరకాల పదార్థాలను నివేదిస్తారు. కొత్త బట్టలు, నగలు ధరించి, ఆడ బిడ్డ లను ఆహ్వానించి అందరూ కలిసి సామూహికంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరును బట్టి, తనను ఆరాధించడానికే శక్తిమాత ఆ రూపాన్ని కోరిందా అని అనిపిస్తుంది. శ్రీ చక్ర ఉపాసన సర్వోత్కృష్టమై న శక్తి ఆరాధన విధానాలలో ఒకటి. బతుకమ్మను పేర్చేట ప్పుడు, కమలం షట్చక్షికం/ అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం ఆనవాయితీ. శ్రీచక్రంలోని మేరు ప్రస్తానం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది. శ్రీచక్రంలో ని కుండలినీ యోగ విశేష శక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలపడం చేస్తారు. ప్రధానంగా తెలంగాణ స్త్రీలు గౌరమ్మను, గౌరీ, లక్ష్మి సరస్వతులు గా త్రిగుణాత్మ స్వ రూపిణిగా భావించి పూజిస్తారు. ”శ్రీల క్ష్మినీ మహమలూ గౌరమ్మ… భారతి సతివయ్యి బ్రహ్మకి ల్లాలివై…. పార్వతీదేవివై పరమేశు రాణివై, భార్యవైతివి హరునకు గౌరమ్మా” అం టూ పాడుకోవడం విశేషం. భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య లేక ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తూ, ఆనాటితో ప్రారంభించి మ#హర్నవమితో ముగించ బడే బతుకమ్మ పండుగ, ఆట పాటలతో నిర్వహంచి, పిల్లాపాపలతో మహళలు తన్మయత్వం పొందుతారు. ప్రతిరోజు వివిధ పిండి వంటలను ఆరగించడం చేత అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు అర్రెమి పేరుతో ఆరవ రోజు సెలవు తీసుకుంటారు. ఇళ్లలో ప్రతిరోజు ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతూ గ్రామ పొలిమేరలో, పంట చేలలో, ఇళ్ళల్లో, పరిసర ప్రాంతా లలో లభ్యమయ్యే తంగే డు, గునుగు, బంతి, గన్నేరు, కట్ల, గోరింట, గుమ్మడి తదితర పూలతో పసుపు గౌరమ్మ దేవతా విగ్రహాన్ని పళ్ళెములో అందంగా, ఆకర్షణీయంగా పేర్చుతారు. నిత్య నూతన వస్త్రదారులై, సాయంత్రం వేళ, బృం దాలుగా పలు రకాల పిండి వంటలతో ఊరి బయటకు, జలాశయాల వద్ద కు వెళ తారు. మధ్యలో బతుకమ్మలను ఉంచి వృత్తాకారంలో ఆడుతూ, పాడుతూ లయబద్ధంగా అడుగులేస్తూ, పదానికి పదం కలుపుతూ, శాస్త్రీయంగా నృత్యం చేస్తారు. వెంట తెచ్చుకున్న తిను బండారాలను ముందుగా నైవేద్యం పెట్టి, బతు కమ్మను నీటిలో నిమజ్జనం గావిస్తారు. అనంతరం పిండి వంటలను తోటివారికి పంచుతూ, పిల్లలతో ఒకే స్థలంలో కూర్చుండి ముత్తయిదులు సామూహకంగా ఆరగిస్తారు. ”చేమంతి వనములో భామలు చెలికుంటలో భామలు, ఓలలాడి నారు” అంటూ గొల్ల భామలు- శ్రీకష్ణుడు పాటలు; ”రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయలవా డే అమ్మ”, ”చిత్తూ చిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికె నమ్మ ఈ వాడలోన” అంటూ శివపార్వతుల గురించి; బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ గూర్చి; ”జనకునింటి ఉయ్యాలో” అం టూ భూజాత యైన మహాసాద్వి సీతాదేవి గురించే గాక ”కలవారి కోడలు కలికి కామాక్షి”అంటూ సామాజిక అంశాల సమస్యలపై సైతం జానపద బాణీలో బృందగానం చేసే సాంప్రదాయ గీతాలు మంత్ర ముగ్ధులను గావిస్తాయి.
అన్ని వర్గాలు కలిసి ఆడడంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాశస్త్యాన్ని తెలిపే సాంస్కృతిక వారసత్వం తరతరాలుగా కొనసాగుతున్నది. కౌటుంబిక, చారిత్రక, పౌరాణిక, సంబంధ బాంధవ్యాల, సామాజిక అంశాలతో ఉన్న జానపద పాటల వల్ల అపురూప సాహత్యాన్ని, వారసత్వాన్ని భావితరాలకు అందించడం జరుగు తున్నది. కుల, మత, వర్గ, పేద, ధనిక భేదాలు లేకుండా, సమిష్టిగా, సామూహ కంగా ప్రకృతి ఆరాధన భాగంగా జరుపుకునే బతుకమ్మ పండుగ చర్విత చర్వ ణంగా సాగుతున్న నిత్య లౌకిక జీవనంలో ఒకింత మార్పు తెస్తూ, నూతనోత్సాహం, సోదర భావాన్ని అలౌకిక ఆనందాన్ని ఆన్నింటినిమించి సామూహక భాగ స్వామ్యాన్ని పెంపొందించగలదనే పరిపూర్ణ విశ్వాసంతో, బతుకమ్మ వేడుకలను మహళలు ఆనందోత్సవాలతో పాల్గొంటున్నారు.

త్యాగంతో బతుకమ్మ

బతుకమ్మ అనే ఓ త్యాగమూర్తి వరద ప్రమాదంలో చిక్కు కున్న వారిని కాపాడి తన ప్రాణాలను త్యాగం చేయడంతో ఆమె స్మార కంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటు న్నారని కథనం ఉంది. పూర్వం ఓ దంపతులకు వరుసగా సంతానం మర ణించింది. ఈ క్రమంలో 8వ సంతానంగా ఓ ఆడపిల్ల జన్మించింది. ఈమెకు బతుకమ్మ అనే పేరు పెట్టారు. దాంతో ఆమె బతికింది. యుక్త వయసుకు వచ్చి వివాహానంతరం ఆమె తన మెట్టినింటికి వచ్చిం ది. ఆ ఇంట్లో భర్త సోదరి ఆమెను ద్వేషించి హత్య చేయించింది. ఆమె విషాద మరణం మహళా లోకాన్ని కలచివేసింది. దీం తో ఆమె స్మృతిగా తంగేడు పూలతో బతుకమ్మ పండుగ ను జరు పుకుంటారు. తమ హృదయాల్లో బతు కమ్మను శాశ్వతం గా బతికించుకుం టూ ఆమెను చిరం జీవిని చేశారు.
చోళరాజు కూతురు

పూర్వం చోళరాజు రుక్మాంగదుడుకు కలిగిన ఏకైక సంతానాన్ని బతికించు కోడానికి గౌరీదేవిని నవ రాత్రులు పూలతో పూజించాడు. దేవీ అనుగ్ర#హంతో సంపూర్ణ ఆరోగ్యవతియైన కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టాడు. అప్పటి నుం చి కుమార్తె గౌరీదేవి అంశతో పుట్టిందనీ పాపను ప్రకృతి పూలతో ఏటా ఆనవాయి తీగా బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకున్నారు.
కాకతీయుల కాలంలో కాకతీయుల చరిత్రకు ఆధారమైన ”సిద్ధే శ్వర చరిత్ర”లో బతుకమ్మ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం కాకతీయుల కాలంలో బతు కమ్మను ఆడేవారని తెలుస్తున్నది. కాగా బతుకమ్మను కాకతీయులు మహళల సామూహక ఉత్సవంగా నిర్వహంచేవారు. దీంతో సామాజిక ఐక్యతను పెంపొం దించేవారు. 5వ శతాబ్దంలో కాకతీయు ల మూల పురుషుడు మాధవవర్మ బతు కమ్మ పండుగను గొప్పగా నిర్వహంచాడు.
నల్గొండ జిల్లా వాడపల్లిలోని బ్రతుకేశ్వర స్థానంలో క్రీ.శ.1211లో కాకతి గణపతిదేవ చక్రవర్తి పేరు మీద మేలుగుంట సోదరులు తమ తల్లిదండ్రులు కోడె మైలసాని స్మృతికి బతుకమ్మ గుడి (త్రికూటాలయాన్ని) కట్టారు. దీంతో సమీపం లోని కృష్ణా నదిలో మ#హళలతో బతుకమ్మ ఆడించి నిమజ్జనం చేయించేవారని ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది. రుద్రమదేవి తన శతరాజు దేవగిరి యాదవ రాజు మహా దేవున్ని క్రీ.శ. 1265లో ఓడించినందుకు విజయ సూచకంగా బతు కమ్మ పండుగ సంబరాలను విజయోత్సవంగా నిర్వ#హంచింది. ఆ క్రమంలో ఆమె ప్రతియేడు మహళలతో కలిసి బతుకమ్మ ఆడి పండుగకు విశిష్టత.
క్రీ. పూ. 1వ శతాబ్దం నాటికే బతుకమ్మ తెలంగాణా కోటి లింగాల నుండి శ్రీకాకుళం లోని జగతిపాడు వరకు విస్తరించింది. అయితే శాతవా#హనుల కాలం లో సాధారణ ప్రజల బతుకమ్మ ఉన్నత వర్గాల ప్రజల గౌరీదేవిగా రూపాంతరం చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement