Tuesday, November 29, 2022

అష్ట ఐశ్వర్య ప్రదాయిని కొల్హాపూర్‌ శ్రీ మహాలక్ష్మి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ హందువుల ప్ర ఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ నగరంలో కొలువై వున్న మహాలక్ష్మీ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాం చింది. ఈ క్షేత్రాన్ని తన భార్య లక్ష్మీదేవి కొలువున్న ప్రదేశంగా శ్రీమహావిష్ణువు చాలా ఇష్టపడతాడని భక్తుల నమ్మకం. అష్టదశ శక్తిపీఠాలలో ఎంతో విశి ష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మిదేవి శక్తిపీఠం. మహాలక్ష్మి అ మ్మవారు కోలహాసురుడును సం#హ రించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్‌ అనే పేరు వచ్చిందని కొందరు అంటారు. మరికొందరు పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడుపై అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని అంటారు.
సకల సంపదలకు నిలయం శ్రీమహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లా ది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వుండే అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే శ్రీమహాలక్ష్మీ ఆల యం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమె దర్శనం చేసుకు ని పునీతులవుతుంటారు. శక్తి పీఠంగా కూడా కొల్హాపూర్‌కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది.

ఆలయం ప్రాముఖ్యత

- Advertisement -
   

ఇక్కడ సతీదేవి నయనాలు పడినట్లు పురాణా లు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆల యం అంతా కళాసృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం అలంకార అభిషేకం నిర్వహస్తారు. మహా లక్ష్మిదేవి మూల విరాట్‌పై నవంబర్‌, ఫిబ్రవరి మాసాలలో సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం. దీనినే కిరణోత్సవం అంటారు.
ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని ‘అంబబాయి’,’కరివీర్‌ మహా లక్ష్మి’ అనే పేరులతో పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగ ణం అంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదా యాలతో కనిపిస్తాయి. గర్భ గుడి ముందు వందడు గుల పొడవు గల మండపం ఉంటుంది. గర్భగుడి లో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మ వారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబా ఆలయం ఉంది. విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారదా అమ్మవారు కాళికా అమ్మవారు, అతిబలేశ్వర స్వా మి ఇక్కడ కొలువై ఉన్నారు.
వైకుంఠపురి నుంచి తరలివచ్చి…

శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగు మహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమ నించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామి వారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహంచిన లక్ష్మీ దేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తప స్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్ను ను లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషి స్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరిం చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
ప్రళయంలోనూ చెక్కుచెదరక…

ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహా దంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవి ముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అం దుకనే ఎన్నో వేల సంవత్స రాల నుంచి ఈ ప్రాంతం లో మహర్షులు, రుషులు పూ జలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నా యి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.
అరుదైన శిలపై అమ్మవారు

శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవి స్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గ ద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వ చనాలు ఇస్తుంటుంది. ‘అంబా బాయి’గా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరొ జు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తా యి. శక్తిపీఠాల్లో కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.
కిరణోత్సవం

సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాల ను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు.
శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరి, నారాయ ణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షానికై యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి వెలసిన ప్రాంతం కావడంతో కొల్హా పూర్‌లోను, ఆ నగరంలో నివశించే ప్రజలకు పేదరి కం వుండదని నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement