Thursday, December 1, 2022

ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై జనసేనతో కలిసి ఉద్యమిస్తాం.. సోము వీర్రాజు

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై జనసేనతో కలిసి ఉద్యమిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇళ్ల నిర్మాణం కోసం జరిగిన భూ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్నారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.35వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు చేస్తూ.. పవన్ ను విమర్శిస్తారా ? అన్నారు. ఇళ్ల నిర్మాణంపై జరుగుతున్న అక్రమాలపై జనసేన పార్టీతో కలిసి ఉద్యమం చేస్తామని సోము వీర్రాజు అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement