Thursday, May 2, 2024

అన్నమయ్య కీర్తనలు : ఈ పాదమే కదా

రాగం : రాగమాలిక

ఈ పాదమే కదా యిలయెల్ల గొలిచినది
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది

ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది
ఈ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది
ఈ పాదమే కదా యిన్నిటికిని యెక్కుడైనది

ఈ పాదమే కదా యిభరాజు దలచినది
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీ బ్రహ్మ కడిగినది
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది

ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
ఈ పాదమే కదా యిల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము
ఈ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది

Advertisement

తాజా వార్తలు

Advertisement