Tuesday, April 30, 2024

అన్నమయ్య కీర్తనలు : నీవేమి సేతువయ్యా


రాగం : భైరవి
నీవేమి సేతువయ్యా
నీవేమి సేతువయ్యా నీవు దయానిధి వందువు
భావిం చలేని వాని పాప మింతే గాని ||

పరమపదమొసగి పాపమడచేనని
చమశ్లోకము నందు చాటితివి తొలుతనె
నిరతిని భూమిలోన నీ వల్ల తప్పులేదు
పరగ నమ్మిన వారి ప ఆప మింతే కాని||

నీ పాదములకు నాకు నెయ్యమైన లంకెని
యేపున ద్వయార్ధమున నియ్యకొంటివి తొలుత
దాపుగా నీవల్ల నింక తప్పులేదు యెంచిచూచి
పైపై నమ్మిన వారి పాపమింతే కాని||

బంతి పురాణమును భక్త సులభుడనని
అంతరాత్మ లీమాట ఆడితివి తొలుతనే
ఇంతట శ్రీ వేంకటేశ యేమి సేతువయ్య నీవు
పంతాన నమ్మిన వారి పాపమింతే కాని||

Advertisement

తాజా వార్తలు

Advertisement