Monday, May 6, 2024

అన్నమయ్య కీర్తనలు : ఏడకేడ నీ చరితము

రాగం : కాంభోజి

ఏడకేడ నీ చరితము యేమని పొగడవచ్చు
యీడులేని మహిమల ఇనవంశరామా||

పరమాన్నములో బుట్టి పక్కన తాటకి చంపి
సరు విశ్వామిత్రు యాగము గాచి
హరువిల్లు విరిచి యట్టె సీత పెండ్లాడి
పరశురాముని చేత బలము చేకొంటివి||

వైపుగా సుగ్రీవు నేలి వాలి నొక్క కోలవేసి
యేపున జలధి గట్టి యెసగితివి
దీపించు రావణు జంపి దివుజులను మన్నించి
యేపుగా విభీషణు రాజ్య మేలించితివి||

సీతతో పుష్పకమెక్కి జిగినయోధ్యకు వచ్చి
గాత రాజ్యపట్టము గట్టుకొంటివి
యీతల శ్రీ వేంకటాద్రి నిటు విజ(య) నగరాన
నీతితో నెలకొని నెగడితిని||

Advertisement

తాజా వార్తలు

Advertisement