Monday, April 29, 2024

YSRCTP – స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల కౌంట‌ర్… కెసిఆర్ ని ఓడించేందుకు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు

హైద‌రాబాద్ – తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.. కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై స‌జ్జ‌ల త‌ప్పు ప‌ట్ట‌డంపై షర్మిల ఘాటుగా స్పందిస్తూ, తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. “నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే… ఆమె పార్టీ పెడితే మాకేంటి సంబంధం అన్న వ్యక్తి సజ్జల. ఇవాళ ఆయన ఏ సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? నేనయితే ఏ సంబంధం లేదనే అనుకుంటున్నాను. మరి మీరు మాట్లాడుతున్నారంటే సంబంధం కలుపుకుంటున్నారని అనుకోవాలా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. ఓవైపు సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ… చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే… దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement