Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : ఎవ్వరెవ్వరి వాడో

ప|| ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు
ఎవ్వరికి నేమౌనో యీ జీవుడు ||ఎవ్వరెవ్వరి ||

చ|| ఎందరికి గొడుకుగాడీ జీవుడు వెనక
కెందరికి దోబుట్టడీ జీవుడు
ఎందరికి భ్రమయించడీ జీవుడు దు:ఖ
మెందరికి గావింపడీ జీవుడు ||ఎవ్వరెవ్వరి ||

చ|| ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు, వెనక
కెక్కడో తనజన్మ మీ జీవుడు
ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు, ఎప్పు
డెక్కడికినేగునో యీ జీవుడు ||ఎవ్వరెవ్వరి ||

చ|| ఎన్నడును జేటులే నీ జీవుడు, వెనక
కెన్ని తనువులు మోవడీ జీవుడు
ఎన్నగల తిరువేంకటేశు మాయలదగిలి
యెన్ని పదవుల బొందడీ జీవుడు ||ఎవ్వరెవ్వరి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement