Sunday, May 19, 2024

సకల శుభకరం ప్రదోష వ్రతం!

దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్త మించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం, ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడా నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోష సమయం దైవాను గ్ర#హ కాలంగా పరిగణిస్తారు.
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు ”ప్రదోషోరజనీముఖమ్‌” రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోష మంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూ లన అని అర్ధము. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్త మయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమ యమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ‘మహా ప్రదోషం’ అంటారు.
ప్రదోష ఉపవాసం ఎల్లప్పుడూ ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో మాత్రమే జరుగుతుంది. ప్రదోష కాలానికి ముందు పూజ చేస్తే పూర్తి ఫలితాలు రావు. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వర రూపంగా ”అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోష కాలం లో, హమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనంద ముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం. గజుసురుణ్ణి సంహారించేటప్పుడు, అంధకాసుర సంహారం లోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారం లో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
ప్రదోషము సమయాన్ని ఈ విధంగా లెక్క కడతారు. ఏ దినమందు సూర్యాస్త మయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియ లైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యా స్తమయము తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఈ త్రయోదశి ప్రదోషము సమయాన్ని ఈ విధంగా లెక్క కడతారు. సాయం త్రం నాలుగున్నర గంటల నుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొం దరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండు న్నర ఘడియలూ అంటారు. (ఒక ఘడియ- 24 ).
– త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం
– త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం
– త్రయోదశి మంగళవారం వస్తే భౌమ ప్రదోషం
– త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం
– త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం
– త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం
– త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.
శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింప బడుతుంది. శనీశ్వరుడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోష పూజతో పోగొట్టుకొనవచ్చును.
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధ³మై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము, సర్వ పుణ్యప్రదము.
ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అను గ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపిం చువాడు, మరియు ధన కారకుడు, జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగు డుగా చెప్పబడినది.
ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠ నమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసిన్లటతే అనంత ఫలము లభిస్తుంది. అని పురాణాలు తెలియచేస్తున్నాయి. భక్తితో ఉద్ధరిణడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు, భోళా శంకరుడు.
ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా, స్త్రీపురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరింపవచ్చు. స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు. మొదటిది రాత్రి, పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం. రెండవ విధానం క్రింద సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉప వాసం చేయడం. సాయింత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తి చేయడం. నిర్వహంచేవారి ఓపిక, సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు.
ముందుగా గణషుని పూజించి తరువాత శివ పార్వతులతో పాటు సుబ్రహ్మణ్యశ్వ రునికి, సందీశ్వరునికి కూడా పూజ చేస్తారు. శివలింగానికి పాలు, పెరుగు మొదలుగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళాలతో పూజచేస్తారు. ప్రదోష కాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు నమ్ము తారు. తరువాత ప్రదోష వ్రత కథ, శివ పురాణం శ్రవణం చేస్తారు. మహా మృతుంజయ మం త్రం 108 సార్లు పఠిస్తారు. పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళతారు. ప్రదోషం రోజు శివాలయం లో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుంది అని భావిస్తారు.
స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవి తం ప్రసాదిస్తాడు. ముఖ్యంగా శివ భక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరి స్తారు.ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, ఆపవాదులు దూరమవుతాయి,
వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరు గుతుంది, సంతాన సాఫల్యం కలుగుతుంది, చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement