Monday, May 13, 2024

అలివేలు మంగమ్మ ఆరగింపులు !

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆ స్వామి పట్టపురాణి తిరచానూరు పద్మావతి. ఆ తల్లికి నిత్యం ప్రత్యేక పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదించే పదార్థాల వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో పాలు, పండ్లు ఆరగింపు చేస్తారు. ప్రతిరోజు మూడు పూటలా పులి హోర, మిరియపు పొంగలి, చక్కరపొంగలి, దద్ధోజనాలను ఆరగింపు చేయడంతో పాటు ప్రత్యేకంగా మొదటి నివేదనలో సిరా (రవ్వకేసరి), మధ్యాహ్నం రెండో నివేద నలో లడ్డూలు, వడలు నివేదన చేస్తారు. నిత్యమూ జరిగే శ్రీపద్మావతి పరిణయోత్సవ వేళలో అప్పాలు, చక్కెర పొంగలి, పులిహోరలు తప్పని సరిగా ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం వేళలో జరిగే ఊం జల్‌సేవలో సిరుల తల్లికి శనగ గుగ్గిళ్లు నివేదన చేస్తారు. రాత్రి ఏకాంతసేవ (పవ ళింపు) సమ యంలో గోరువెచ్చని పాలు, పంచకజ్జాయం నివే దిస్తారు. ప్రతి గురు వారం తిరుప్పావడ సేవలో పులిహోరతోపాటు ప్రత్యేకంగా జిలేబీలు నివేదిస్తారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వేళ పద్మావతి తల్లికి ప్రత్యేకంగా పాయసం ఆరగింపు చేస్తారు. శుక్రవారం తోటలో ఆ మధ్యాహ్నం అభిషేకా నంతరం వడపప్పు, పానకం, మిరయపు పొంగలి, పిదప అలంక రణ అయిన తర్వాత పులిహోర, దోసెలు, సున్నుండలు నివేదిస్తారు.
అమ్మవారికి సారె
పద్మావతి పుట్టినరోజుకు జరిగే పదినాళ్ల పండుగలే కార్తీక బ్రహ్మోత్సవాలు. చివరి రోజు అంటే అలువేలు మంగమ్మ అవత రించిన పంచమీ తీర్థం నాటికి తిరుమల పరంధాముడు ప్రియంగా పుట్టినరోజు సారెను పంపిస్తాడు. రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికలు, పసుపు ముద్ద, శ్రీ గంధపు కర్ర, పచ్చి పసుపు చెట్లు, పూల మాలలు, తులసి మాల లతో పాటు ఒక బంగారు హారం, ఇవికాక పిండివంట లు, పడి (51) పెద్ద లడ్డూలు, ఒక పడి (51) వడలు అప్పా లు, ఒక పడి (51) దోసెలు వీట న్నింటిని ఆ రోజు ఉదయం ముందుగా తిరుమ లలో శ్రీవారి మూలమూర్తికి సమర్పిస్తారు.ఆ తర్వాత వీటిని దేవ స్థానం అధి కారులు, పరిచారకులు, సిబ్బంది కొత్త వెదురు బుట్టలలో పెట్టు కొని కాలినడకన అలిపిరి పాదాల మండ పం దగ్గర్లోని శ్రీపద్మావతి పసుపు మండపం దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి పసుపుకుంకుమ, చీర సారెలను ఏనుగు అంబారీపైన పెట్టుకొని మేళతాళాలతో శ్రీ కోదండరామా లయం స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరు చానూరు చేరుకుంటారు. అక్కడిపద్మావతి అమ్మవారి ఆలయం అర్చకులు, అధికారులు తిరుమల శ్రీవారి సారెకు దివ్య మంగళ నీరాజనాలిస్తారు. అనంతరం అమ్మవారికి సమర్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement