Tuesday, May 7, 2024

పరహితమే పరమ ధర్మం!

పరోపకారాయ ఫలన్తి వృక్షా: పరోపకారాయ వ#హన్తి నద్య:|
పరోపకారాయ దుహన్తి గావ: పరోపకారార్థమిదం శరీరమ్‌||
అన్నాయి ధర్మశాస్త్రాలు. పరోపకారం కోసమే వృక్షాలు ఫలి స్తాయని, పరోపకారం కోసమే నదులు ప్రవహస్తాయని, పరోపకారం కోసమే ఆవులు పాలనిస్తాయని, పరోపకారం కోసమే మానవ శరీరం ఉంద ని, ఇలా ప్రకృతిలోని చెట్లు, నదులు మొదలైనవాటి వలన జీవకోటికి ఎంతో ఉపకారం జరుగుతోందని శ్లోకం యొక్క భావం.
భువిపై నివసించే జీవులలోకెల్లా ఉత్కృష్టమైనది మానవ జన్మ. 87 లక్షల జీవరా సుల్లో మానవుడు మాత్రమే ప్రత్యేకం. ఇతర జీవులకు లేని ఆలోచనా శక్తి, జ్ఞానం ఉన్న ఏకైక జీవి మానవుడు. గ్రంథాలలో బోధించినట్టే సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడంటే చేయూతనిచ్చి సాయపడేవారు మానవులు. పరోపకారం చేయమని పర#హతం తలపెట్టమని బోధించాయి మన గ్రంథాలు. అలాంటి ఒక సంఘటన మహాభారతంలో కనిపిస్తుంది.
అరణ్యవాసంలో ఉన్న పాండవులు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం పొందారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుండి బకాసురుడుకి ఆహారం కావడం కోసం ఒకరు వెళ్లాల్సి ఉండగా, ఆ కుటుంబీకులంతా భోరున విలపించారు. వారి రోదనలు విన్న కుంతీదేవి ఓదార్చి, వారికి బదులుగా తన కు మారుడు భీముడిని ఆహారంగా పంపిస్తుంది. ఇంత గొప్పగా ఆలోచించడం సామాన్య విషయం కాదు. ప్రాణ హాని ఉందని తెలిసీ కొన్నాళ్ళు ఆశ్రయం పొందినందుకే ఆ కుటుంబానికి వచ్చిన ఆపద నుండి గట్టెక్కించాలని ఆలోచించింది కుంతీదేవి. ప్రాణ ప్రమాదమని తెలిసినా పరోపకారం కోసం వెనుకడుగేయకూడదని తెలుపు తున్న ఇంకో సన్నివేశం పరిశీలిద్దాం.
క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుండి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే మహావిషం కారు మేఘాల లాగా వెలువడనారంభించింది. రాక్షసులు, దేవతలు భయంతో వాసుకిని విడిచి పరుగెత్తసాగారు. ఆ హాలా#హలము భగభగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో ధగధగమనే జ్వాలలతో ఆకాశాన్ని ఆవరిస్తు

న్నది. అడవులు మండిపోతున్నాయి. జీవరాసులు మాడిపోతున్నాయి. నదులు, సముద్రాలు ఇంకిపో తున్నాయి. పర్వతాలు బద్దలవుతున్నాయి. ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. అకాల ప్రళయం సంభవించిందేమో నని భయ భ్రాంతులయ్యారు బ్రహ్మాది దేవతలు. ఆ ఆపద నుండి లోకాలని రక్షించమని ప్రార్ధిస్తూ పరమశివుడిని శరణు కోరారు. వారి ప్రార్ధనలను ఆలకించిన పరమశివుడు, ఆ హాలాహలాన్ని స్వీకరించి లోకాలను రక్షి స్తానని అభయమిచ్చాడు. అది విన్న పార్వతీదేవి అభ్యంతరం తెలుపగా, శివుడు ఇలా సమాధాన మిచ్చి నట్టు భాగవతం వర్ణించింది.
పరహతము సేయునెవ్వడు
పరమహతుండగు భూతపంచకమునకున్‌
పరహతమె పరమధర్మము
పరహతునకు నెదురు లేదు సర్వేందుముఖీ||
”లోకాల ఆర్తిని చూసావు కదా? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది. పరహతమే పరమ ధర్మం” అన్న భర్త శివుడి మాటలకు తలొగ్గింది పార్వ తి. లోక రక్షణ కోసం పరమశివుడి నిర్ణయాన్ని ఆమోదించింది.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్‌
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
మ్రింగవలసినది హాలాహలమని తెలిసి, మ్రింగ దలచుకున్నవాడు తన పతి దేవుడే అని తెలిసి కూడా, దానివలన లోకాలకు మేలు కలుగుతుందనే సదుద్దేశంతో, సర్వమంగళ అయిన పార్వతీదేవి విషాన్ని మ్రింగ మని అనుమతించింది. ఇదికదా పర#హతం కోరడమంటే!. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తన కంఠంలో దాచు కుని గరల కంఠుడు అయ్యాడు శివుడు. అటువంటి ఉదాత్త, లోక:శ్రేయకర ఆదర్శాలను ఉద#హరించారు పురాణ కారులు. వాటి నుండి తగిన ప్రేరణ పొందాలి మానవులు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించి పర#హ తమే పరమ ధర్మం అని చాటి చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement