Sunday, May 12, 2024

స్వయంతో మాట్లాడుకోవడము

నీ మనసుతో నీవు మాట్లాడుకుంటున్నప్పుడు ”నీవు” అంటే ఎవరు ఇక్కడ? ఎలా? సాధారణంగా మనుష్యులు తమలోని దివ్య స్వరూపం తో మాట్లాడరు. వారి దైనందిన జీవితంలోని బాహ్య వ్యక్తిత్వంతోనే మాట్లాడుతూ ఉంటారు. అది తరచూ భయము, ఫిర్యాదులు, అనవసరమైన పాత విషయాల గురించిన చింతనగానే ఉంటుంది. ఈ విధంగా మనం ఇంకెవరితోనైనా మాట్లాడితే మనం క్షమాపణ చెప్పవలసి ఉంటుంది.

స ్వయంతో సరైన విధంగా మాట్లాడము ఒక ఆధ్యాత్మిక యత్నము. గతంలోని ఆలోచనలు, భవిష్యత్తు గురించిన చింతలు సంభాషణను చక్కగా సాగనివ్వవు. ఇందుకు బదులుగా నీ మనసును ఒక చిన్నపిల్లవాడిగా ఊహించుకుని మాట్లాడు. దానితో ప్రేమతో మాట్లాడు. ఒక పిల్లవాడిని నువ్వు బలవంతంగా కూర్చోమంటే అతడు కూర్చోడు. ఒక మంచి తల్లికి తన బిడ్డతో మంచి పనులను చేయించడానికి ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నీ మనసుకు నేర్పించు. అప్పుడు నువ్వు నీ మనసును ప్రశాంతంగా కూర్చో అని చెబితే అది నీ మాట వింటుంది. నీ మనసును ప్రేమించు, సంతోషంగా ఉండు.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement