Thursday, May 2, 2024

సీతాశోక వినాశకా…!

అష్ట సిద్ధి నౌ నిధి కే దాతా !
అసబర దీన జానకి మాతా!!
అష్ట సిద్ధులను, నవ నిధులను ఇవ్వగల వరాన్ని సీతమ్మ తల్లి హనుమకు ఇచ్చింది. అశోక వనంలో సీతాదేవిని రక్షించి, రామచంద్రుడి యోగ క్షేమాలను తెలియపరిచి ఆప్తవాక్యం పలికి, ఆనందాన్ని కలిగించిన హనుమకు సీతామాత ఈ సిద్ధులను నిధులను ఇవ్వగల అనుగ్రహ శక్తిని హనుమ పరంగా ఇచ్చి ఆశీర్వదించింది.
అష్ట సిద్ధులు ఏవి?
అణిమా: సూక్ష్మ రూపం ధరించగల శక్తి.
మహిమా: విరాట్‌ స్వరూపం ధరించగల శక్తి
గరిమా: అత్యంత ఘన శక్తి
లఘిమా: శరీరాన్ని తేలిక చేసి గాలిలో ప్రయాణించగల శక్తి
ప్రాప్తి: కోరుకున్న విధంగా దేనినైన పొందగల శక్తి
ప్రాకామ్యము: సంకల్పమాత్రంగా కోరుకున్న వస్తువును పొందగల శక్తి
ఈశిత్వము: అన్నిటి యందు అధికారమును పొందగల శక్తి
వశిత్వము: ఇంద్రియాదులను జయించగల శక్తి
ఉపాసన, సాధన, శమాదులతో ఈ సిద్ధులను సాధించవచ్చు. కానీ స్వీయ సిద్ధులను స్వీయ ప్రయోజనానికి వాడుకోకూడదు. హనుమ ఈ అష్ట సిద్ధులను శ్రీ రామకార్యంలో, నిస్వార్థంగా ప్రయోగించి, స్వామి కార్యాన్ని సుసంపన్నం చేసి, చరితార్థుడైనాడు. ఇక నవ నిధులంటే మహా పద్మము, మకరము, కుచ్చపము, పద్మము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము.
ఈ నవ నిధులన్నీ కేవలం ప్రాపంచిక నిధులు మాత్రమే కాదు. ఉపాసన మార్గంలో వినియోగించే వస్తు సముదాయము.
హనుమదుపాసన వలన ఈ సిద్ధులు, నిధులు సులభంగా లభిస్తాయ్‌. మన కాలంలో నవ విధ భక్తి మార్గాలే మనకు నవ నిధులు. ఇవన్నీ ఆత్మ విచార మార్గం వైపు నడిపించే నవ్య విధులు.
అష్ట సిద్ధులనన్నిటిని లోకహితం కోసమే నియోగించాలి.

– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement