Tuesday, May 7, 2024

సహనము (ఆడియోతో…)

స్వ పరివర్తనకు అవసరమైన ముఖ్యమైన సుగుణము – సహనము. సహనము లేకపోతే పరివర్తన క్రియలో ఆశను కోల్పోతారు. నీ జీవన మార్గంలో ఒక్కోసారి గరుకు మార్గాలలో ప్రయాణించవలసి వస్తుంది. అక్కడ నీ అడుగులు జారి అకస్మాత్తుగా నువ్వు మార్గాన్ని తప్పిపోతావు. చెడు ఆలోచనలు, మాటలు లేక ప్రవర్తన కనిపిస్తాయి.
సహనము నిన్ను ప్రశాంతంగా, చల్లగా ఉంచుతుంది. అది నీ ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తుంది. ఆత్మ అవగాహన అన్నది పది గజాల స్థలం కాదు, అది నూట యాభై మైళ్ళ పరుగు వంటిది. అందులో వేగంగా వెళ్ళడం నేర్చుకోవాలి. సహనము వేగాన్ని పెంచుకునే విధానాన్ని నేర్పిస్తుంది. ఇటువంటి సహనము లేనిదే నువ్వు భగవంతుడి నుండి సహాయాన్ని పొందలేవు. సహనము ఉన్నచోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఈ క్రొత్త అనుభవాన్నే మానవత్వంతో ఉండటము అని అంటారు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement