Sunday, May 19, 2024

యోగ క్షేమం వహామ్యహం

భగవ ద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం యే మే భక్త్యా ప్రయతద్వావహం భక్త్యు పహత్వం అశ్నామి ప్రయతాత్మన: అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎవరు నిర్మలమైన భక్తితో, త్రికరణ శుద్ధిగా ఆకు
ను గాని, పండును గాని, పుష్పాలుగాని, జలము గాని, నాకు సమర్పిస్తారో, స్వీకరిస్తానని సాక్షాత్తు
ఆ శ్రీకృష్ణ పరమాత్మే తెలియచేసాడు. భగవంతుడు చెప్పినవన్నీ పరమాత్మ జీవుల కోసం సృష్టించినవే!
ఆయన మనకు సమకూర్చిన వాటిని తిరిగి ఆయనకే నివేదించడానికి, తేడాలు ఎందుకు? మీమాంసలు ఎందుకు? అయితే వాటిని సమర్పించడానికి ముందు మనలో భగవంతుని పట్ల విశ్వాస ం, భక్తి ఉండాలి.
చిన్నిపిల్లలకు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులు వద్దకు వచ్చిచెప్పుకొన్నట్లుగా, ఆ తల్లిదండ్రులకే సమస్యలొస్తే ఉపశమనం పొందడానికి ఆ భగవంతుడినే ఆశ్రయిస్తుంటాము. ఆయన శరణాగతిని పొందాలి. రైలు
 మొదటి తరగతి, రెండవ తరగతి, జనరల్‌ బోగీలలోని ప్రయాణికులందర్నీ గమ్యం చేర్చినట్లుగా, భగవంతుడు అనే ఉద్యానవనంలోని భక్తి అనే పుష్పాలతో హృదయం అనే ఫలాలను నివేదించిన వారందరి
కీ ఆ పరమాత్మ కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ఆనంద ప్రియుడు. ఆహార ప్రియుడు కాదు. పరమేశ్వరు
డు మనలోని నిర్మలత్త్వాన్ని, నిస్వార్థతను చూస్తాడు. లంకలో ఆ రాక్షసుల మధ్య సీతామహాసాధ్వి ఏడాది పాటు మానసిక క్షోభ అనుభవిస్తూనే క్షేమంగా ఉన్నదంటే,ఆమె చేసిన శ్రీరామ నామ జప మహిమ, ఆమెకు పతియందున్న భ క్తియేదానికి కారణం! ఆ పతి సాక్షాత్తు విష్ణు స్వరూపమేకదా. శ్రీ కృష్ణ తులాభార సమయంలో భగవంతుని దివ్యతత్త్వాన్ని తెలియచేసేటందుకే శ్రీకృష్ణుని పరమాత్మ స్వరూపంగా బావిస్తున్న రుక్మిణీ దేవి వేసిన ఒక్క తులసిదళంతోనే ఆమె అనన్య భక్తిని వెల్లడించారు. శంకరా చార్యులు శివానందలహరిలో ”పరమేశ్వరా! కామధేనువు, కల్ప వృక్షం, అన్నీ నీవద్దనే ఉన్నాయి. ఈ విశ్వానికే జగన్మాత నీ చెంతనే ఉన్నది. అహంతో కూడిన నా మనసు తప్ప ఇంకేమి ఇచ్చి నిన్ను మెప్పించగలను?” అంటూ తన భక్తిని తేటతెల్లం చేసారు.
అలాగే, శబరి మాతంగ ముని ఆశ్రమంలో ఉంటూ శ్రీరామ నామం జపిస్తూ ఒంటరిగా ఆ అరణ్యం లో రాముని రాకకై ఎదురు చూసిందంటే ఎవరు రక్ష? ఆ పరమాత్మే. సుదాముడు (కుచేలుడు) ధర్మతత్పరు
డు. గృ#హంలో దారిద్య్రం తాండవిస్తున్నా, ఎవరినీ యాచించని వాడు. శ్రీకృష్ణుని పరమభక్తుడు. ఆయన
తెచ్చిన గుప్పెడు అటుకులు తినే, సంపదను ప్రసాదించాడు. ఆ సంపద కుచేలుని భార్య పిల్లల కోసం. అయితే అతనికి ఆధ్యాత్మిక సంపదే దృఢమయ్యేట్లు అనుగ్రహించాడు. రంతి దేవుడు సహజసిద్ధంగా రాజు.
సిరిసంపదలకు లోటులేనివాడు. అయినా ఒక మహాయోగివలె నిరంతరం హరినామస్మరణతో ఉండేవాడు.
ధర్మదాత. దానధర్మాలు చేయడం వల్ల సంపదను, రాజ్యాన్ని, కోల్పోయాడు. హరినామస్మరణతో ఆహార పానీయాలు లేకుండా నలభై ఎనిమిది రోజులు అడవిలో సంచరించసాగాడు. నలభైతొమ్మిదో రోజున ఆ అరణ్యంలో ఒక చోట పాయసం, నెయ్యి, నీళ్ళు లభిస్తే మ#హదానందంతో భుజించడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా విచ్చేసి, ఆహారాన్ని కోరాడు. ఉన్న ఆహారంలో సగం భాగం ఇచ్చి తృప్తిపరిచాడు.
మిగిలిన అర్థబాగం తిందామనుకొనేసరికి, ఒక ఆటవికుడ వచ్చి ”ఆకలి బాధతో ఉన్నాను. ఆహారం కావాల”న్నాడు. అతడలా అడగగానే, ఉన్న దాంట్లో సగభాగం ఇచ్చి పంపాడు. ఇంతలో మూడు కుక్కలతో బిక్షగాడు వచ్చి అడిగాడు. ఉన్నదంతా ఇచ్చి పంపేశాడు. ఉన్న జలమైనా తాగు
దామనేసరికి, ఒక నిమ్న జాతివాడు వచ్చి, విపరీతమైన దాహంగా ఉంది. గొంతు ఎండిపోతోంది అంటే అతని
కి జలమిచ్చి సంతృప్తి పరచాడు. ఇదంతా భగవత్సంకల్పం అని తలపోసి, ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడం కంటే పరమార్థం ఏముంటుంది? అని భావిస్తున్న తరుణంలో బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.
”నీ అనన్య భక్తికి మెచ్చుకొంటున్నాము. ఇప్పుడు వచ్చిన వారంతా మేము సృష్టించినవారే” అని పలికి
ఏదైనా వరం కోరుకోమన్నారు. దానితో రంతి దేవుడు ”నా మనస్సు ఎప్పుడూ విష్ణుభక్తితోనే ఉండాలి” అని మాత్రమే కోరుకొన్నాడు.
అయితే ప్రస్తుతం మనం జీవిస్తున్న పరిస్థితుల్లో గృహస్థాశ్రమంలో ఇలా కోరుకోగలగడం సాధ్యమేనా? అని అనిపిస్తుంది. అందుకే ఈ గృహస్థాశ్రమంలో ధర్మాచరణ, కర్తవ్యనిష్టతో ఉండి, అంతా పరమాత్మ సంకల్పమే అనే భావనతో ఉంటూ శరణాగతిని పాందాలి. అంతేకాదు నిత్యం ఎంతోకొంత సేపు ఆ భగవంతుని పై దృష్టి ఉంచి, అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తుంటే భగవంతుడు మనలని కాపాడతాడు. అందుకే భగవద్గ³ీతలో (9వ అధ్యాయం)లో
”అనన్యాశ్చియన్తో మాం యే జనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహమ్‌!
అని చెప్పాడు. అంటే ఎవరైతే అనన్యభక్తితో నన్నే సేవిస్తూంటారో, నిరంతరం చింతన చేస్తూ ఉంటారో
, అటువంటి వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూసుకొంటానన్నాడు. నిరంతరం పరమాత్మ సేవలో
గడిపిన శ్రీ చైతన్య మహాప్రభు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, పురందరదాసు, అన్నమయ్య, త్యాగయ్య, నామదేవుడు, మీరాబాయి, సక్కుబాయి, ఇలా ఎంతోమంది జీవితాలు మనకు ఆదర్శం. భగవంతుని రక్షణకు ఇవి సాక్ష్యాలు. అందుకే మనం అందరం ఆధ్యాత్మిక చింతన దిశగా అడుగులు వేయాలి. వేద్దాం! ఆ పరమేశ్వరుడి సంరక్షణలో జీవిద్దాం!


ఎ. రంగారావు ,
79894 62679

Advertisement

తాజా వార్తలు

Advertisement