Friday, April 26, 2024

బ్రహ్మాకుమారీస్‌ – పాలించే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో ఆరవది ‘పాలించే కళ ‘

పాలించే కళ :
ఏవిధముగా తల్లి తన పిల్లలను చాలా ప్రేమగా, త్యాగంతో, సేవాభావముతో అలసట లేకుండా పాలన చేస్తుందో అలాగే చిత్రప్రదర్శనలు, మేళాలు ఇతరమైన ఎలాంటి సేవ అయినా సరే నిరంతరాయంగా చేస్తూ ఉండండి. చేసి సేవకు చక్కగా ఫలితం వస్తుందని బాబా చెప్పేవారు. ఏ జిజ్ఞాసువయినా ఏదో ఒక కారణంతో క్లాసుకు రాకపోయినట్లయితే మురళీ పంపండి, ఉత్తరాలు పంపించండి. టోలీ(ప్రసాదము) పంపించండి లేక ఏదైనా ఒక పని ఇస్తూ ఉండండి. అపుడు వాళ్ళు మీ సంప ర్కములోనికి వస్తూవుంటారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement