Saturday, April 20, 2024

​సుశాంత్ సింగ్​ రాజ్​‌పుత్​ సూసైడ్ కేసులో మరొకరి అరెస్ట్​

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. వారం క్రితం హైదరాబాద్‌లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. బుధవారం సుశాంత్‌కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ ఖాన్‌ను ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేశారు. అతడు పలువురు ప్రముఖులకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని గుర్తించారు.

ప్రస్తుతం ఆ ఇద్దరినీ విచారిస్తున్నామని, ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. హరీశ్ ఖాన్ ఫోన్‌లో, వాట్సాప్ చాటింగ్ లలో అతనికి డ్రగ్స్ సరఫరాదారులతో లింకులున్నట్టు తేలడం వల్లే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అతడి గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. గత ఏడాది అక్టోబర్ లో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement