Friday, March 29, 2024

సెలబ్రిటీలు సహాయం చేయట్లేదు అనటంపై తమన్నా ఫైర్

కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే ఈ స్టార్స్ పై కొంతమందిని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదే విషయమై తమన్నా మాట్లాడుతూ…. సినీ స్టార్ ఆశించినంత సేవా కార్యక్రమాలు చేయడం లేదని అనడం అర్థరహితమని ఇలాంటి విమర్శలు వల్ల సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. స్టార్స్ ఎంత చేసినా చేయడం లేదని అనడం తగదని చాలామంది ప్రచారం చేయకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా అవుతున్నారని అన్నారు. చేసిన సహాయం గురించి చెప్పుకోవడం లో ఏమాత్రం తప్పులేదు.

దాని నుంచి కొందరైనా స్ఫూర్తి పొంది మరింత సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ప్రచారాలకు చాలా దూరంగా ఉంటాను. సహాయం గురించి ఎక్కడా చెప్పను. సినీ తారలకు సంపద ఉంటుందని వారు ఎక్కడ పోయినా విలాసంగా ఉంటారని అనుకుంటారు. కానీ డబ్బులు ఊరికే రావని అందరిలాగానే వారు కష్టపడాలి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement