Thursday, May 2, 2024

బ్రహ్మాకుమారీస్‌ – పరమాత్మ స్వరూపము (ఆడియోతో…)

ఏదైనా ఒక వస్తువు యొక్క స్వరూపము ఈ స్థూల నేత్రాలకు కనిపించకపోవచ్చుగాక కానీ ఏదో ఒక అస్తిత్వము(ఉనికి) కలిగి దానికి రూపం లేకుండా వుండుట అసంభవము. ఇదే విధంగా భగవంతుడు కూడ రూపరహితుడు కాడు. అతనికి దివ్యమైన, అలౌకికమైన, అవ్యక్తమయిన శక్తి స్వరూపం ఉన్నది. ఈ స్వరూపమును దివ్యచక్షువు ద్వారానే దర్శించవచ్చును. పరమాత్మ నిరాకారుడు అనే దానికి అర్థము అతనికి ఏ రూపము లేదని కాదు. నిరాకార శబ్దము అన్యాత్మల దైహిక స్వరూపం యొక్క పోలికతో ప్రయోగించబడినది.

ఆత్మలన్నీ స్థూల, సూక్ష్మ శరీరాలను ధరిస్తాయి. కానీ పరమాత్మ జనన మరణాతీతుడు. సూక్ష్మ శరీరం ధించే వారిని సూక్ష్మాకార దేవతలు లేక దేవతలంటారు. పరమాత్మకు తనదంటూ సాకార శరీరము లేదు. సూక్ష్మమైన ఆకార దేహము లేదు. కావుననే అతనిని నారాకారుడంటారు. నిరాకారమనగా అకాయుడు, అవ్యక్తుడు, అశరీరియని గ్రహించాలి. ఈశ్వరుడు రూపాతీతుడు. అతని రూపము అతీతమయినది. పరమాత్ముని దివ్య స్వరూపము ”జ్యోతిర్బిందువు” అనగా జ్యోతి ఆకారము వంటి స్వరూపము. ఇదే చిత్రంలో కూడా చూపబడినది.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement