Sunday, May 19, 2024

నేటి రాశి ప్ర‌భ (25-10-2021)

మేషం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవా ధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

వృషభం: ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కుటు-ంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. దూరపు బంధువులను కలుస్తారు.

కర్కాటకం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్య భంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు.
ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

సింహం: ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవ దర్శనాలు.

- Advertisement -

కన్య: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: కుటు-ంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తీర్థ యాత్రలు.

వృశ్చికం: సంఘంలో ఎనలేని గౌరవం. ఆప్తుల నుంచి శుభ వార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: నూతన విద్యా వకాశాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి. దైవ దర్శనాలు. కుటు-ంబంలో ఉత్సాహం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగాలాభించవు. ఉద్యోగాలలో ఇబ్బందులు. దైవ దర్శనాలు.

కుంభం: ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: ఉద్యోగ యత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement