Saturday, May 18, 2024

నేటి రాశి ప్రభ (24-03-2021)

మేషం:
పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.

వృషభం:
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు నూతన పరిచయాలు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. గృహయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం:
కొన్ని పనులు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం:
దూరపు బంధువుల కలయిక. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

సింహం:
చిత్రమైనంఘటనలు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలబ్ధి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

కన్య:
రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల:
ఆర్థికంగా ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. లేనిపోని వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం:
బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు:
ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందర్శనం. బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

మకరం:
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం:
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం:
పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement