Saturday, April 27, 2024

నవరాత్రి రహస్యాలు – నవరాత్రి దీ క్షలలో కుమారీ ఆరాధన(ఆడియోతో…)

నవరాత్రి రహస్యాలు – నవరాత్రి దీ క్షలలో కుమారీ ఆరాధన గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

నవరాత్రి దీక్షలలో భాగంగా ఆయా దేవీ ఆరాధనలలో వయస్సును అనుసరించి చేయునది కుమారీ ఆరాధన.
ఒక సంవత్సరం వయస్సు ఉన్న శిశువు బాల కావున ఈమెనే బాలాత్రిపుర సుందరిగా ఆరాధిస్తారు. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న బాలికను సరస్వతిగా, మూడు సంవత్సరాల వయస్సు ఉన్న బాలికను త్రిధామూర్తిగా ఆరాధిస్తారు. నాలుగు సంవత్సరాల శక్తిని కాళికా అని, అయిదు సంవత్సరాలకు సుభగా, ఆరు సంతవత్సరాలకు ఉమాగా ఆరాధిస్తారు. ఏడు సంతవత్సరాలకు మాలిని అని, ఎనిమిది వర్షములకు కుబ్జా అని, తొమ్మిది వర్షములకు మహాకాళీ అని, పది వర్షములకు అపరాజితా అని, పదుకొండు సంవత్సరాలకు రుద్రాణీగా ఆరాధిస్తారు. అలాగే పన్నెండు సంవత్సరాలకు భైరవి అని, పదమూడు సంవత్సరాలకు మహాలక్ష్మీ అని, పద్నాలుగు సంవత్సరాలకు పీఠనాయికా అని, పదిహేను సంవత్సరాలకు క్షేత్రజ్ఞ అని, పదహారు సంత్సరాలకు అంబికా అని ఈ విధంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక సంవత్సరం నుండి పదిహేను సంవత్సరాల వయసున్న బాలికలను ఆయా శక్తి నామాలతో చేసే పూజలను కుమారీ పూజగా వ్యవహరిస్తారు.

ఇంతేకాకుండా ఈ కుమారీ పూజను అయిదు నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు వరకు బాల, కుమారీ, అంబ అనే పేర్లతో పూజించే సాంప్రదాయం ఉంది. వీరిలోనే గౌరీ, రోహిణీ, కన్యా, దుర్గా, కాళీ, అంబా, అన్నపూర్ణా, విశాలాక్షీ, కుముద్వతీ అనే పేర్లతో కుమారీ పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో అన్నము, వస్త్రము, జలము, ఆభరణములను బాలికలకు అర్పించి ఆరాధిస్తారు. కుమారీ దీక్షలో, కుమారీ పూజలతో అనంతమైన ఫలితాలను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement